ఎంపీ కవితకు మోదీ బర్త్ డే విషెస్

ఎంపీ కవితకు మోదీ బర్త్ డే విషెస్

13-03-2018

ఎంపీ కవితకు మోదీ బర్త్ డే విషెస్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల  కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తెలుగులో శుభాకాంక్షలు చెబుతూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. మీరు దేశ ప్రజలకు సేవలందించేందుకు కావాల్సిన ఆరోగ్యకర, ఆనందకర జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. ఇట్లు మీ భవదీయ నరేంద్ర మోదీ అంటూ ఆ లేఖలో బర్త్‌ డే విషెస్‌ చెప్పడం విశేషం.