వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

13-03-2018

వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయశుద్ధిలో భాగంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఉదయం వైభవంగా జరిగింది. ఈ నెల 18న ఉగాది ఆస్థానం జరగనున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం నిలిపివేసి ఆలయ అధికారులు, సిబ్బంది మహాయజ్ఞంలా శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 11 గంటలకు శాస్త్రోక్తంగా శ్రీవారికి పూజలు చేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.