జాగృతి ఎన్నారై శాఖలకు నూతన అధ్యక్షుల నియామకం
Nela Ticket
Kizen
APEDB

జాగృతి ఎన్నారై శాఖలకు నూతన అధ్యక్షుల నియామకం

20-04-2017

జాగృతి ఎన్నారై శాఖలకు నూతన అధ్యక్షుల నియామకం

తెలంగాణ ఉద్యమంలో క్రీయశీకలంగా ఉండి  తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి అంకితమైన సంస్థ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు, అధ్యక్షులు, ఎంపీ కవిత తెలిపారు. ఇటీవలే దశాబ్ది ఉత్సవం జరుపుకున్న జాగృతి  ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో శాఖలతో తెలంగాణ వారికి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో ఆయా దేశాల శాఖలకు నూతన అధ్యక్షులను ఆమె ప్రకటించారు. నూతన బాధ్యులు తెలంగాణ జాగృతి ఆశాయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ అభ్యున్నతికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణీయులు సంక్షేమానికి కృషి చేయాలని కవిత సూచించారు. నియమకాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

జాగృతి గల్ఫ్‌ దేశాలు అధ్యక్షులు చెల్లంశెట్టి హరిప్రసాద్‌, యూఎఈ కిరణ్‌కుమార్‌ పీచర, బహరైన బర్కుంట బాబురావు, కువైట్‌ ముత్యాల వినయ్‌కుమార్‌, సౌది అరేబియాకు మహమ్మద్‌ మొజ్జం, ఉత్తర అమెరికా (అమెరికా అండ్‌ కెనడా) అధ్యక్షుడు శ్రీధర్‌ బండారు, ప్రధాన కార్యదర్శి సుమత్‌ గరకరాజుల, అమెరికా అధ్యక్షుడు రాజ్‌ గౌలికర్‌, కెనడా రమేష్‌ మునుకుంట్ల, యూరప్‌ అధ్యక్షులు సంపత్‌ ధన్నంనేని, యూకే అధ్యక్షుడు సుమన్‌ బల్మూరి, ఆస్ట్రేలియా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి బొర్ర, న్యూజిలాండ్‌ అరుణజ్యోతి ముద్దం నియమిచారు. అలాదే విదేశీ శాఖలతోపాటు మహారాష్ట్ర శాఖ అధ్యక్షులను ప్రకటించారు. మహారాష్ట్ర అధ్యక్షునిగా శ్రీనివాస్‌ సుల్గే, ఈ బాధ్యులకు నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని, త్వరలోనే ఈ విదేశీ శాఖల అధ్యక్షుల నేతృత్వంలో ఆయా దేశాల శాఖలకు పూర్తిస్థాయి కమిటీలు ప్రకటించనున్నట్లు జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి తెలిపారు.