ఎర్ర బుగ్గలకు స్వస్తి
APEDB
Ramakrishna

ఎర్ర బుగ్గలకు స్వస్తి

20-04-2017

ఎర్ర బుగ్గలకు స్వస్తి

రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రులతో సహా పలువురు విఐపిల కార్లపై ఇక ఎర్ర బుగ్గలు కనిపించవు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర వాహనాలకు మినహాయించి మిగిలిన ఏ విఐపి కార్లపై కూడా ఎర్రబుగ్గలు ఉయోగించకూడదన్న నిర్ణయం మే 1 నుంచి అమలులోకి వస్తుంది. దీనిని చారిత్రాత్మక, ప్రజాస్వామిక నిర్ణయమని రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభివర్ణించారు. అధికారంలో ఉన్నవారు విఐపిలు తమ కార్లపై ఎర్రబుగ్గలు  వాడకంపై ప్రజలు సానుకూలంగా స్పందించడం లేదని, వారి నుంచి ప్రతికూల భావాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కార్లపై ఎర్ర బుగ్గలుపయోగించి దుర్వినియోగానికి పాల్పడిన ఉదంతాలు చాలా ఉన్నాయన్నారు. కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే గడ్కరీ ఉపయోగించే అధికారిక వాహనాలపై ఎర్ర బుగ్గలను తొలగించారు. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలిసారిగా విఐపిల కార్లపై ఎర్ర బుగ్గలను తొలగించింది. ఇటీవల కాలంలో పంజాబ్‌లోని ఆమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాలు అధికారుల కార్లపై ఎర్ర బుగ్గలను తొలగించాయి. ఇప్పుడు కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.