అద్దాల బండి పట్టాలెక్కింది
Nela Ticket
Kizen
APEDB

అద్దాల బండి పట్టాలెక్కింది

20-04-2017

అద్దాల బండి పట్టాలెక్కింది

అరకు అందాలు వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల కోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించిన అద్దాల కోచ్‌ అధికారికంగా పట్టాలెక్కింది. విశాఖపట్నం-కిరండోల్‌ మధ్య రాకపోకలు సాగించే పాసింజర్‌కు ఈ బోగీని జత చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ నుంచి ఉదయం 7:10 గంటలకు ఈ రైలు బయలుదేరింది. డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. కోచ్‌లో సౌకర్యాలు పరిశీలించారు. తొలిరోజు బోగీలోని 48 సీట్లూ నిండాయి. మరో ఇరవై రోజుల్లో రెండో అద్దాల కోచ్‌ రానున్నదని అధికారులు తెలిపారు.