రివ్యూ : మైండ్ ఫ్రెష్ నెస్ కి 'చల్ మోహన రంగ' థియేటర్స్ కి
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

రివ్యూ : మైండ్ ఫ్రెష్ నెస్ కి 'చల్ మోహన రంగ' థియేటర్స్ కి

05-04-2018

రివ్యూ : మైండ్ ఫ్రెష్ నెస్ కి 'చల్ మోహన రంగ' థియేటర్స్ కి

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5 

నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్ తది తరులు 
సినిమాటోగ్రఫర్ : నటరాజన్ సుబ్రమణియం, సంగీతం : తమన్
ఎడిటర్ : ఎస్.ఆర్. శేఖర్, కథ: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు : త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి
స్క్రీన్ ప్లే,దర్శకత్వం : కృష్ణ చైతన్య

విడుదల తేదీ:05.04.2018


యంగ్ స్టార్ నితిన్, మేఘా ఆకాష్ లు జంటగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిల సంయుక్త నిర్మాణంలో కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. త్రివిక్రమ్ శ్రీనివాస్  కథను అందించిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏ రేంజ్ లో ఈ చిత్రం ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు మోహన రంగ (నితిన్) అమెరికా లో ఉంటే  సాలిడ్ ఏ టెన్షన్ లేకుండా  గా జీవితం లో  సెటిలైపోవచ్చు అనే ఉద్దేశ్యంతో అనేక ప్రయత్నాలు చేసి చిట్ట చివరికి అమెరికా వెళ్తాడు. అక్కడే అతనికి మేఘా సుబ్రహ్మణ్యం (మేఘా ఆకాష్) పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఒక దశలో ఆ స్నేహమే ప్రేమని తెలుసుకుంటారు ఇద్దరు. కానీ ఒకరి లైఫ్ స్టైల్ మరోకరి లైఫ్ స్టైల్ కు మ్యాచ్ అవ్వదనే  తడబాటుతో  ప్రేమని వ్యక్తపరుచుకోకుండానే విడిపోతారు. అప్పటి నుండి ఇద్దరికీ ప్రశాంతత ఉండదు. అలా దూరమైన ఇద్దరూ కొంత కాలానికి తమ ప్రేమ సరైనదేనని, ఒకరికొకరు సరిపోతారని ఏ రకంగా  గుర్తించారు, ఎలా కలుసుకున్నారు అనేదే మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

సినిమాకు ప్రధాన బలం సినిమా హీరో నితిన్ పాత్ర చిత్రీకరణ. నితిన్ ఒక హీరోలా కాకుండా నార్మల్ మధ్యతరగతి మనస్తత్వం కలిగిన కుర్రాడు గా  మోహన్ రంగ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు.  నిజాయితీని, హాస్యాన్ని మేళవించి కథానాయకుడి పాత్రను తెరపై అతను  అవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. హీరోయిన్ మేఘా ఆకాష్ కూడ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి మెప్పించింది. ఆమెకు, నితిన్ కు మధ్యన నడిచే ఫన్నీ సీన్స్ బాగా  ఆకట్టుకున్నాయి. ఇక ఫస్టాఫ్ ఆరంభం నుండి చివరి వరకు అన్ని పాత్రల ద్వారా హాస్యాన్ని పండించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా చోట్ల సఫలమై నవ్వులు పూయించింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు కృష్ణ చైతన్య త్రివిక్రమ్ అందించిన కథను ఒక మంచి సినిమాకు సరిపడా స్థాయిలో అభివృద్ధి చేయడంలో కాస్తంత తడబడ్డారు. ముఖ్యమైన ప్రేమ కథలో ఎమోషన్స్ సరిగా పండించలేకపోవడం, కీలకమైన బ్రేకప్, తిరిగి కలుసుకోవడం వంటి అంశాల వెనుక బలమైన కారణాలను చెప్పకపోవడం వంటి బహీనతలతో కొంత నిరుత్సాహపరిచిన కృష్ణ చైతన్య హీరో పాత్రను భిన్నంగా డిజైన్ చేసి నితిన్ ను స్క్రీన్ పై కొత్తగా చూపడంలో, మంచి హాస్యాన్ని పండించడంలో మాత్రం సఫలమయ్యారు. నటరాజన్ సుబ్రమణియం అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను ఎంతో అందంగా కనబడేలా చేసింది. ఫారిన్ లొకేషన్స్, ఊటీలో తెరకెక్కించిన ప్రతి ఫ్రేమ్ ఆహ్లాదపరిచింది. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ బాగానే ఉంది. తమన్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. నిర్మాతలుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డిలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన్న ఈ ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం కొంత ఆకట్టుకోని కొంత నిరుత్సాహపరిచింది. హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఎలివేట్ అయ్యేలా బలమైన రొమాంటిక్ సన్నివేశాలు, విడిపోయాక వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేసే భావోద్వేగపూరితమైన పరిస్థితులు కానీ కనబడలేదు. అసలు హీరో హీరోయిన్లు ఒక చిన్నపాటి క్యాజువల్ మీటింగ్ కు ఒకరు రాలేదని మరొకరు అపార్థం చేసుకుని విడిపోవడం కొంత సిల్లీగా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్థంలో ఫన్నీ సీన్స్ మినహా ప్రేక్షకుడ్ని కదిలించే సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతో సినిమా నీరసంగా ముగిసిన ఫీలింగ్ కలిగింది. హీరో పాత్ర, అందులో నితిన్ నటన, ప్రాసలతో కూడిన మాటలు, రెగ్యులర్ గా వచ్చే కామెడీ సీన్స్, కొన్ని పాటలు ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా కథలో పూర్తిస్థాయి ఎమోషన్, రొమాన్స్ లోపించడం రొటీన్ గా అనిపించే కథనం, కీలకమైన ఘట్టాల వెనుక బలమైన కారణాలు లేకపోవడం డిసప్పాయింట్ చేసే అంశాలు. మొత్తం మీద రొమాన్స్ తగ్గినా.. కామెడీ బాగున్న ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు.