రివ్యూ : కామెడీ లవ్ ఎంటర్టైనర్ 'హలో గురు ప్రేమ కోసమే'

రివ్యూ : కామెడీ లవ్ ఎంటర్టైనర్ 'హలో గురు ప్రేమ కోసమే'

18-10-2018

రివ్యూ : కామెడీ లవ్ ఎంటర్టైనర్  'హలో గురు ప్రేమ కోసమే'

తెలుగుటైమ్స్  రేటింగ్ :3/5  

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు :  రామ్ పోతినేని, అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌కాష్ రాజ్‌, ప్రణీత,  సితార‌, జ‌య ప్ర‌కాష్‌
సినిమాటోగ్రఫీ  : విజయ్ కె చక్రవర్తి, ఎడిటర్ : కార్తీక శ్రీనివాస్
సంగీతం : దేవీ శ్రీ ప్ర‌సాద్‌, నిర్మాతలు  : దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
దర్శకత్వం : త్రినాధ్ రావు న‌క్కిన‌

విడుదల తేదీ: 18.10.2018

యంగ్ హీరో రామ్ హీరోగా కింగ్ నాగార్జున హిట్ సాంగ్  ‘హ‌లో గురు ప్రేమ కోసమే’ టైటిల్ తో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణలో, శిరీష్ - లక్ష్మణ్ నిర్మాతలుగా,  సినిమా చూపిస్త మామ‌, నేను లోక‌ల్ చిత్రాలతో స‌క్సెస్ సాధించిన త్రినాథ్ రావు న‌క్కిన ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద క‌న్నేశాడు. సరైన హిట్ లేని రామ్ కు  హాట్ట్రిక్ హిట్ కోసం త్రినాధ్ల 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' చిత్రంతో  కోరిక నెరవేరిందా లేదా రివ్యూ లో చూద్దాం.

కథ:

సంజూ(రామ్ పోతినేని) కాకినాడలో అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా ఉండే కుర్రాడు. తనకి ఇష్టం లేకపోయినా అమ్మానాన్నల కోసం  జాబ్‌ చేయడానికి హైదరాబాద్‌ లో వున్న విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) ఇంట్లో వుంటాడు. ఈ క్రమంలో విశ్వనాథ్ కూతురైన అనుపమ ట్రైన్‌లో కాకినాడ గురించి తక్కువ చేసి మాట్లాడిందని అను(అనుపమా పరమేశ్వరన్‌)ను టీజ్‌ చేస్తాడు. తర్వాత అను.. తను ఎవరి ఇంట్లో ఉండటానికి వచ్చాడో ఆ విశ్వనాథ్‌‌ కూతురు అని తెలిసి సంజూ షాక్‌కు గురవుతాడు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌లో జాయిన్‌ అయిన సంజూ అక్కడ రీతు(ప్రణీత)ను ఇష్టపడతాడు. అయితే ఓ సంఘటన కారణంగా తన మనసులో ఉన్నది అను అని తెలుసుకుంటాడు.  కానీ అదే సమయంలో విశ్వనాథ్‌, అనుకి వేరే సంబంధం చూడటంతో కథ మలుపు తిరుగుతుంది. సంజు ప్రేమను అను అంగీకరించిందా? తన ప్రేమను కాపాడుకోవటానికి సంజూ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టుల పెర్ఫార్మన్స్:

రామ్ మ‌రోసారి తనదైన  ఎనర్జిటిక్ ప‌ర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కామెడీ సీన్స్లోనూ  మెప్పించాడు. కానీ గత చిత్రాలలో కనిపించిన విధంగానే మొనాటమి ప్రదర్శించాడు.   లుక్, బాడీ లాంగ్వేజ్‌ విష‌యంలో  పెద్ద‌గా కొత్తదనం చూపించ‌క‌పోవ‌టం నిరాశ‌ క‌లిగిస్తుంది. అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కు మ‌రోసారి న‌ట‌నకు ఆస్కారం ఉన్న పాత్ర ద‌క్కింది. ప్ర‌ణీత తెర మీద క‌నిపించింది కొద్దిసేపే అయినా ఉన్నంత‌లో త‌న ప‌రిధి మేర‌కు ఆక‌ట్టుకుంది. కీల‌క పాత్ర‌లో న‌టించిన ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి త‌న‌దైన న‌ట‌న‌తో సినిమాను న‌డిపించాడు. దాదాపు హీరోకు స‌మాన‌మైన పాత్ర‌లో కామెడీ, ఎమోష‌న్స్‌ను అద్భుతంగా పండించాడు. జ‌య‌ప్రకాష్, సితార, ఆమని, పోసాని కృష్ణ‌ముర‌ళీ వారి వారి పాత్రల మేరకు నటించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి సరైన అవుట్ ఫుట్ నుఇచ్చారు. రొటీన్ స్టోరీ అయినా ఎంగేజింగ్ కథనంతో ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధించారు. ఎక్కడ బోరింగ్ లేకుండా  కామెడీ ని ఎమోషన్స్ ను బ్యాలన్స్ చేసిన తీరు కూడా బాగుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ ఇష్టంగా ఈ సినిమా చెసిండడు అనిపిస్తుంది అతని  నుండి ఆశించిన మ్యూజిక్ ఈచిత్రంలో ఉండదు. రామ్ గత చిత్రాలకు అద్భుతమైన ఆడియో ను అందించిన దేవి ఈ చిత్రం తో నిరాశ పరిచాడు. ఒక్క టైటిల్ సాంగ్ తప్ప మిగతా పాటలు ఏవి బాగోలేవు రి-రికార్డింగ్ పరవాలేదు.  కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. విజయ్ కె చక్రవర్తి ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. ఇక ప్రముఖ నిర్మాతలు  దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ ల  నిర్మాణ విలువలు జస్ట్ ఒకే అనిపిస్తాయి. 

విశ్లేష‌ణ :

సినిమా చూపిస్త మామ‌, నేను లోక‌ల్ లాంటి ఫ్యామిలీ అండ్ కామెడీ  ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన మ‌రోసారి సేఫ్ గేమ్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. రామ్ లాంటి ఎన‌ర్జిటిక్ స్టార్ ఉన్నా కామెడీ, ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టాడు. ప్ర‌కాష్ రాజ్, రామ్ ల మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. కూతురుని పడేయటానికి తండ్రినే సహాయం అడగటం కాస్త సిల్లీగా అనిపించినా. అది  కామెడీ పరంగా బాగానే  పండింది. అయితే తొలి అర్థభాగం చాలా సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. ప్రకాశ్‌ రాజ్‌, రామ్‌ల కెమిస్ట్రీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. కామెడీ టైమింగ్‌లోనూ రామ్‌, ప్ర‌కాష్ రాజ్‌లు ఒక‌రితో ఒక‌రు పోటీప‌డి మ‌రీ న‌టించారు. సినిమాకు ప్ర‌ధాన బ‌లం మాట‌లు, కామెడీతో పాటు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల్లోనే డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. 

తీర్పు :

స్టోరీ రొటీన్ అయినా  త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ హలో గురు ప్రేమకోసమే చిత్రం ప్రేక్షకులను చాలా వరకు మెప్పిస్తుంది. రామ్, ప్రకాష్ రాజ్ ల నటన అలాగే కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్ అవ్వగా సింపుల్ స్టోరీ,  బలమైన  లవ్ ట్రాక్ లేకపోవడం సినిమాకు మైనస్ గా చెప్పవచ్చు. ఓవరాల్ గా చిత్రం అటు ఫ్యామిలీ అడియన్సు కు అలాగే ఇటు యూత్ కు  బాగా నచ్చుతుంది. దసరా పండుగకు తెలుగు ప్రేక్షకుడికి మంచి విందు భోజనం 'హలో గురు ప్రేమ కోసమే'.