రివ్యూ : సస్పెన్స్ థ్రిల్లర్ గా '118'

రివ్యూ : సస్పెన్స్ థ్రిల్లర్ గా '118'

01-03-2019

రివ్యూ : సస్పెన్స్ థ్రిల్లర్ గా '118'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 3/5

నిర్మాణ సంస్థ : ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ 
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే, నాజర్, హరి తేజ, ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు. 
సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటర్ : తమ్మిరాజు
నిర్మాత : మహేష్ S కోనేరు
ఛాయాగ్రహణం, దర్శకత్వం, చిత్రానువాదం : కె .వి. గుహన్

విడుదల తేదీ : మార్చి 01, 2019

ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ.. సినీ పరిశ్రమకు టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేస్తున్న హీరో కళ్యాణ్ రామ్. ఇటీవల సరైన హిట్ లేక  కెరీర్ ని  మలుపు తిప్పే బిగ్‌ హిట్ కోసం ఎదురుచూస్తున్న  కల్యాణ్ రామ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా కూడా మెప్పింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. మరి ఆ అంచనాలను 118 అందుకుందా.? ఇంతకీ ఈ 118 సంఖ్యా భావం  ఏమిటి?  ఈ సినిమాతో కల్యాణ్ రామ్‌ మరో సక్సెస్‌ సాధించాడా? సమీక్షలో చూద్దాం.

కథ:

గౌతమ్‌ (కల్యాణ్ రామ్‌) ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్‌ను ఓ కల బాగా డిస్ట్రబ్‌ చేస్తుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్‌ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్‌కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్‌ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా పరిష్కరిస్తాడు ? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టుల హావభావాలు :

గతంలో ఇజం సినిమాలో రిపోర్టర్‌ గా కనిపించిన కల్యాణ్‌ రామ్‌ మరోసారి జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్‌ రామ్‌ ఆకట్టుకున్నాడు.  ఈ సారి స్టైలిష్‌ పాత్రలో మరింతగా మెప్పించాడు. పర్ఫామెన్స్‌, యాక్షన్‌ సీన్స్‌లోనూ సూపర్బ్ అనిపించాడు. సస్పెన్సు  థ్రిల్లర్ సినిమా కావటంతో రొమాన్స్‌, డ్యాన్స్‌లకు  పెద్దగా స్కోప్‌ లేదు. హీరోయిన్‌ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది.  ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్‌ శ్రీను, నాజర్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: 

2010 లో ఈనిధు ఈనిధు అనే  తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్‌ లాంగ్ గ్యాప్‌ తరువాత తెలుగు సినిమాతో మరోసారి మెగా ఫోన్‌ పట్టుకున్నాడు.టాప్ సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌కు సుపరిచితుడైన కేవీ గుహన్‌, 118 సినిమాతో తెలుగు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  రొటీన్‌ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్‌ఫిక్షన్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు.సినిమాటోగ్రాఫర్‌గా గుహన్ ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు.సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్‌ను తన మ్యూజిక్‌తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర. తమ్మిరాజు ఎడిటింగ్‌ బాగుంది. మహేష్ కోనేరు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా రిచ్ గా  ఉన్నాయి.

విశ్లేషణ: 

సినిమాకు మేజర్ ప్లస్ అంటే కాన్సెప్ట్ అనిచెప్పాలి. ఇక ఆ కాన్సెప్టు ని తెర మీదకు తీసుకురావడంలో కె వి గుహన్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇంట్రస్టింగ్ పాయింట్‌ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఓకె మూడ్‌లో సాగటం ఆకట్టుకుంటుంది. ఫస్ట్‌ హాఫ్ రేసీ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ సీన్స్‌తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు.ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ ఫై ఇంట్రస్ట్ ను తీసుకొస్తుంది. ప్రీ క్లైమాక్స్‌కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్‌ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్‌గా అనిపించవు. చివరగా ఈ చిత్రం ఏ సెంటర్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అయితే బి & సి సెంటర్ల ప్రేక్షకులు ఈసినిమా ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.