ఆక‌తాయి.. బోర్ కొట్టించేశాడు
APEDB

ఆక‌తాయి.. బోర్ కొట్టించేశాడు

11-03-2017

ఆక‌తాయి.. బోర్ కొట్టించేశాడు


తెలుగు తెర‌కు ఎంతో మంది నూత‌న న‌టీనటులు ప‌రిచ‌య‌మై వారి అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూ ఉంటారు. అలా హీరోగా ప‌రిచ‌య‌మై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌నుకున్న క‌థానాయ‌కుడు ఆశిష్‌రాజ్‌. రామ్ భీమ‌న ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్ నిర్మాత‌లుగా రూపొందిన చిత్రం `ఆక‌తాయి`. ఈ సినిమాతో రుక్సార్ మీర్ అనే హీరోయిన్ కూడా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. మ‌రి వీరిద్ద‌రికీ ఆక‌తాయి ఎలాంటి బ్రేక్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థః
విక్రాంత్‌(ఆశిష్‌రాజ్‌), శేఖ‌ర్‌, మాధ‌వి(సుమ‌న్‌, రాశి)ల ఒక్కగానొక్క సంతానం. విక్రాంత్ చ‌దివే కాలేజ్‌లోనే అన‌గా(రుక్సార్ మీర్) జాయిన్ అవుతుంది. విక్రాంత్ మంచిత‌నం చూసి అత‌నితో ప‌రిచ‌యం పెంచుకుంటుంది. ఈ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. విక్రాంత్ త‌న త‌ల్లిదండ్రుల‌కు అన‌గాను ప‌రిచ‌యం చేసి త‌మ ప్రేమ విష‌యాన్ని చెబుతాడు. ఓ రోజు అన‌గా, విక్రాంత్ త‌ల్లిదండ్రులు అత‌ని పేరున పెద్ద క‌ర్మ చేయ‌డం గ‌మ‌నిస్తుంది. అది విక్రాంత్‌కు చెప్పి అస‌లు వారిద్ద‌రూ నీ త‌ల్లిదండ్రులేనా అని అడుగుతుంది. ముందు విక్రాంత్ కూడా ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోడు కానీ..కొన్ని ఘ‌ట‌న‌ల‌తో అనుమానం వ‌చ్చి, ఆరా తీస్తే ఓ నిజం తెలుస్తుంది. ఈలోపు ముంబై నుండి వ‌చ్చిన ఓ గ్యాంగ్ శేఖ‌ర్‌, మాల‌తిల‌ను చంపేస్తుంది. ఆ గ్యాంగ్ నుండి విక్రాంత్‌ను ఓ వ్య‌క్తి కాపాడి, విక్రాంత్‌కు ఓ నిజం చెబుతాడు. ఆ నిజ‌మేంటి? అస‌లు విక్రాంత్ ఎవ‌రు? విక్ర‌మ్ సింహ‌, విక్రాంత్‌కు ఉన్న సంబంధం ఏంటి? విక్ర‌మ సింహ‌, జ‌హంగీర్‌కు ఉన్న గొడ‌వేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే

విశ్లేష‌ణః
హీరో ఆశిష్ రాజ్ తొలి సినిమా అయినా చ‌క్క‌గానే న‌టించాడు. డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. హావ‌భావాలు విష‌యంలో ఇంకా బెట‌ర్ కావాలి. రుక్సార్ గ్లామ‌ర్‌గా బావుంది. ఇక సుమ‌న్‌, రాశి, ప్ర‌దీప్‌రావ‌త్‌, పోసాని, అజ‌య్ ఘోష్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సినిమాలో కీల‌క‌పాత్ర‌లో రాంకీ త‌న‌దైన రీతిలో మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.పృథ్వీ, బ్ర‌హ్మానందం కామెడి నవ్వించ‌లేక‌పోయింది. ఏదో కామెడి ట్రాక్ ఉండాలి కాబ‌ట్టే ఇరికించిన‌ట్టు అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు రామ్ భీమ‌న ఓ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో సినిమా క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు ఫ‌స్టాప్‌లో ముందు సాదాసీదాగా, బోరింగ్‌గా సాగే ఈ సినిమా ఇంట‌ర్వెల్ ముందు ఓ ప‌దిహేను నిమిషాలు కాస్తా ఆస‌క్తిక‌రంగా మారుతుంది. అయితే సెకండాఫ్‌లో ఈ ఆస‌క్తిని మెయిన్‌టెయిన్ చేయ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు రామ్‌భీమ‌న‌. సెకండాఫ్ అంతా రివేంజ్ డ్రామా స్టైల్‌లో సాగుతుంది. ఇంట‌ర్నేష‌న్‌లో డాన్ అయిన ప్ర‌దీప్ రావ‌త్ నెట్‌వ‌ర్క్‌ను హీరో అత‌ని తొట్టి గ్యాంగ్‌తో చేదించాల‌నుకోవ‌డం, ఆ స‌న్నివేశాలు న‌మ్మ‌శ‌క్యంగా ఉండ‌వు. ఇక మ‌ణిశ‌ర్మ ట్యూన్స్ ఆయ‌న పాత పాట‌ల‌ను విన్న‌ట్లే అనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప‌రావాలేదు. వెంక‌ట్ గంగ‌ధారి సినిమాటోగ్ర‌ఫీ గొప్ప‌గా లేదు. క్లైమాక్స్ యాక్ష‌న్స్ సీన్ ఏదో వీడియో గేమ్‌ను చూస్తున్న‌ట్లు అనిపిస్తుంది. ఎడిట‌ర్ ఇంకాస్తా సినిమా నిడివిని త‌గ్గించాల్సి ఉంది. క‌మ‌ర్షియ‌ల్ పంథాలో రూపొందించిన ఆక‌తాయి ఆస‌క్తిక‌రంగా లేదు..