రివ్యూ : మ్యూజికల్ లవ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా 'వైశాఖం'

రివ్యూ : మ్యూజికల్ లవ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా 'వైశాఖం'

21-07-2017

రివ్యూ : మ్యూజికల్ లవ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా 'వైశాఖం'

తెలుగు టైమ్స్ .నెట్ రేటింగ్ 3.25/5

బ్యానర్ : ఆర్ జె సినిమాస్,
నటీనటులు : హరీష్ (తొలి పరిచయం) అవంతిక మిశ్రా (తొలి పరిచయం) సాయి కుమార్, కాశీ విశ్వనాధ్,
ప్రిథ్వి రాజ్, భద్రం, 'జబర్దస్త్'  అప్పారావు తది తరులు... 

సినిమాటోగ్రఫీ : వాలిశెట్టి సుబ్బా రావు, సంగీతం : డి జె వసంత్,
ఆర్ట్ : మురళి కొండేటి, పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, భాస్కర బట్ల,
లైన్ ప్రొడ్యూసర్ : బి శివ కుమార్, నిర్మాత : బి ఏ రాజు,
కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం : జయ బి.

విడుదల తేదీ :21.07.2017


చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ వంటి సూపర్ హిట్ చిత్రాల  తర్వాత డైనమిక్ డైరెక్టర్ బి. జయ కొద్దిపాటి గ్యాప్ తర్వాత తీసిన సినిమా విశాఖం. ఉమ్మడి కుటుంబాల కథలతో చాలా సినిమాలు గతంలో చాలా సినిమా లు వచ్చాయి. కానీ ఈ సినిమా ద్వారా రక్తం పంచుకున్న వారే కాదు పట్టణాల్లో ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్న వారందరు కూడా వుమ్మడి కుటుంబానికి చెందిన వారే నాని మంచి మెసేజ్ తో వచ్చిన సినిమా వైశాఖం.  హరీష్ ను హీరో గా, అవంతిక ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఆర్ జె సినిమా బ్యానర్ లో ప్రముఖ నిర్మాత బి ఏ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయ్యింది. దర్శకురాలు బి జయ ఈ  కొత్త పాయింట్ ను  ఎంత వరకు ప్రజెంట్ చేయగలిగిందో సమీక్షలో తెలుసుకుందాం. 

కథ :

హైదరాబాద్ లోని  ఓ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న వేణు (హరిష్) అందులో ఉన్న వారందరిని ఏదో ఒక పనిలో తనకు ఉపయోగపడేలా వాడుకుంటాడు. ఇక అదే అపార్ట్మెంట్ లో బ్యూటీ  పార్లర్ నడపటానికి  అద్దెకు దిగుతుంది భానుమతి  (అవంతిక). భానుమతి కి ఆ ఫ్లాట్ అద్దెకు ఇవ్వడానికి నిరాకరించిన ప్రెసిడెంట్ తో అందరూ  భయపడే  వేణు కి  ప్రేమికురాలిని అంటూ  పరిచయం చేసుకుంటుంది. ఒకానొక సందర్భంలో ఈ విషయం వేణు తెలుస్తుంది.  అక్కడే  అసలు సమస్య మొదలవుతుంది. ఇక ఇద్దరు ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. ముందు స్నేహితులుగా ఉన్న వారు ఆ తర్వాత ప్రేమికులుగా మారుతారు. కొన్ని విషయాల్లో  ఇద్దరి మధ్య ఎప్పుడు మనస్పర్ధలు రావడం గొడవపడటం జరుగుతుంది. ఈ నేపధ్యం లో వేణు మారతాడని వేరే చోట  పక్షవాతం తో వున్నా అతని అమ్మ ని తన ఫ్లాట్ కి తెచ్చుకుంటుంది. టిట్ ఫర్ టాట్ లా  ఇదే అదనుగా వేణు బాను వాళ్ళ నాన్న ను తన ఫ్లాట్ కి బలవంతంగా తీసుకువస్తాడు. ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది ?  అసలు భాను ఎవరు..? ఆమె అక్కడికి ఎందుకు వచ్చింది..?పక్షవాతం తో వున్నా  వేణు వాళ్ళ అమ్మను బాను తన ఇంటికి ఎందుకు తెచ్చింది? వీరి ప్రేమ ఎలా సుఖాంతం అయ్యింది అన్నది అసలు కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

హీరో గా పరిచయం అయినా  హరిష్ నటన బాగుంది.. ఓ పక్క సరదాగా ఉంటూనే ఎమోషనల్ సీన్స్ లో బాగానే అలరించాడు. డాన్సులు ఫైట్స్ లో చక్కగా అనుభవం వున్నా ఆర్టిస్ట్స్ గా అనిపించాడు. బాను గా నటించిన  అవంతిక కూడా తన నటనతో బాగా ఆకట్టుకుంది.  సినిమాలో ఆమె పాత్రకు తగ్గ అభినయం తో ఇంప్రెస్ చేసింది. ఇక కథలో ఇంపార్టెంట్ పాత్ర సాయి కుమార్ ది చిన్న పాత్రే అయినా సాయి కుమార్ నటన హైలెట్ గా నిలిచింది.  క్రికెట్ బెట్టింగ్ లో సమస్తం కోల్పోయిన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా  పృధ్వి, సెక్రటరీ గా  భద్రం, కాశీ విశ్వనాధ్, 'జబర్దస్త్'  అప్పారావు వంటి నటులు పాత్ర పరిధి మేరకు నటించారు. 

సాంకేతిక వర్గం పని తీరు:

దర్శకురాలు జయ ఎంచుకున్న పాయింట్ చిన్నదే అయితే దాన్ని తెరకెక్కించే విధానంలో  స్క్రీన్ ప్లే, మాటలు  రాసుకోవడం లో సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం యూత్ లో వుండే పంచ్ డైలాగ్స్ సినిమాని బోర్ లేకుండా చేసాయి. సినిమాలో చెప్పదలచుకున్న పాయింట్ ని సినిమా ఆఖరున  చూపించడం  క్లైమాక్స్ కి హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం అపార్ట్మెంట్ కల్చర్ పైన అల్లుకున్న కథ చిన్నదైనా 2 ఘంటల 11 నిమిషాల పాటు సినిమా గా చూపడం చాలా కష్టం ఈ విషయం లో ఆమె సక్సెస్ అయ్యినట్టే.  డి జె వసంత్ అందించిన  మ్యూజిక్ చాలా  బాగుంది. టైటిల్ సాంగ్, భానుమతి సాంగ్, ప్రార్థిస్తున్నా పాటలు  ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచాయి. కెమెరామన్ సుబ్బారావు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చిత్రానికి  ప్లస్ అయ్యింది. కొత్త హీరో హీరోయిన్లతో నిర్మించినా  ఖర్చు విషయం లో  ఎక్కడ కాంప్రమైస్ అవ్వలేదు బి.ఏ.రాజు ప్రొడక్షన్ వాల్యూస్  రిచ్ గా ఉన్నాయి. 

విశ్లేషణ :

లవ్లీ తర్వాత  బి జయ కొద్దిపాటి గ్యాప్ తర్వాత తీసిన సినిమా విశాఖం. సినిమా పాయింట్ చాలా చిన్నదే.. ముఖ్యంగా సినిమా అసలు పాయింట్ మనది అనుకోవడమే చాలా గొప్పది అన్న కాన్సెప్ట్ సినిమా లాగించారు. కథ ఓకే అనేలా ఉన్నా కథనంలో ఇంకాస్త పట్టు సాధించాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్ హీరో హీరోయిన్స్ మధ్య స్నేహం ప్రేమ..గొడవలు పడటం అపార్ట్మెంట్ లో ఇతర సభ్యుల తో కామెడీ సీన్స్ లతో సినిమా ఎంటర్టైనింగ్ గా  కథ నడుస్తుంది.  అసలు కథ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. రక్త సంబంధాలతో వున్నా వుమ్మడి కుటుంభం లో అమ్మ నాన్న అక్క అన్న తమ్ముడు చెల్లెలు బాబాయ్ మామయ్య పిన్ని అత్తయ్యలు ఎలా వుంటారో ఎలాంటి రక్త సంభందం లేక పోయిన నేటి అపార్ట్మెంట్ కల్చర్ లో కూడా అలా ఉండాలని ఆలా ఉండడం వలన ఎంత ఉపయోగం ఉందొ? ఎలాంటి ఆనందాన్ని అనుభూతి పొందుతారో తెలియచేసే కొత్త పాయింట్ తో అందించిన సినిమా వైశాఖం.   సినిమాలో అసలైన ట్విస్ట్ క్లైమాక్స్ దాకా ఉంచడం.. ఈలోపు ప్రేక్షకులు సినిమా మీద ఓ నిర్ణయానికి రావడం జరుగుతుంది. పాటలు, డైలాగ్స్ పర్వాలేదు. ఆర్టిస్టులు కొత్త వారు కాబట్టి వారిని ఆడియెన్స్ డైజెస్ట్ చేసుకోడానికి కాస్త సమయం పడుతుంది. కాని ఫస్ట్ హాఫ్ లో  ఇంకాస్త జాగ్రత్త పడుంటే బాగుండేది.  ఓవరాల్ గా మ్యూజికల్ లవ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా  బి జయ చేసిన ఓ మంచి  ప్రయత్నానికి అభినందించాలి.