రివ్యూ : రానా పెర్ఫార్మన్స్ హైలెట్ గా 'నేనే రాజు నేనే మంత్రి'

రివ్యూ : రానా పెర్ఫార్మన్స్ హైలెట్ గా 'నేనే రాజు నేనే మంత్రి'

11-08-2017

రివ్యూ : రానా పెర్ఫార్మన్స్ హైలెట్ గా 'నేనే రాజు నేనే మంత్రి'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్‌: 2.75/5

బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్ బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ తో కలసి.... నటీనటులు : రానా, కాజల్, క్యాతరిన్ థ్రెస, నవదీప్,అశుతోష్ రానా,శివాజీ రాజా,తనికెళ్ళ భరణి, అజయ్,జోష్ రవి, జయప్రకాశ్ రెడ్డి,ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి,సత్య ప్రకాష్, రఘు కారుమంచి,బిత్తిరి సత్తి,సంజయ్ కపూర్ మరియు బిందు చంద్ర మౌళి తది తరులు.... సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : లక్ష్మి భూపాల్, సురేంద్ర కృష్ణ, నిర్మాత : డి .సురేష్ బాబు,కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, కథ, మాటలు, దర్శకత్వం : తేజ విడుదల తేదీ:11.08.2017 ‘

లీడర్ తో యువ సి ఎం గా కెరీర్ ప్రారంభించిన దగ్గుబాటి రానా, కృష్ణ వందే జగద్గురుమ్, ఘాజి’ వంటి డిఫరెంట్ సినిమాలతో మిగతా హీరోలకంటే తాను భిన్నమని చెప్పి ‘బాహుబలి’ తో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగిన నటుడు రానా చేసిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ:

ఒక ఊళ్ళ్లో రైతులకు న్యాయమైన వడ్డీ ధరకు అప్పులిస్తూ తను ప్రాణంగా ప్రేమించే భార్య రాధ(కాజల్ అగర్వాల్) తో కలిసి ఆనందంగా బ్రతికే మామూలు వ్యక్తి రాధా జోగేంద్ర (రానా) కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రాధ కోసం తనకెలాంటి అనుభవంలేని రాజకీయాల్లోకి దిగుతాడు.తనకంటూ ఓ మంచి ఫ్యామిలీతో సంతోషంగా జీవితం గడుపుతున్న జోగేంద్ర అనుకోకుండా సర్పంచ్ తో జరిగిన గొడవ వల్ల తాను రాజకీయ నాయకుడిగా మారాలని ఆలోచన వస్తుంది1. అక్కడి నుండి తన ఎత్తుగడలు మొదలవుతాయి. మొదట సర్పంచ్ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలా ఏకంగా ముఖ్యమంత్రికి కూడా చుక్కలు చూపించేస్తాడు. అయితే ఈ క్రమంలో తనకు శత్రువులు పెరిగిపోతారు. జోగేంద్ర భార్య రాధా ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ వెళ్తున్న జోగేంద్రకు ఒకానిక దశలో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అసలు జోగేంద్ర ఎందుకు అలా మారుతాడు..? ఉరి తీసేంత తప్పు జోగేంద్ర ఏం చేశాడు..? ఫైనల్ గా కథ ఎలా ముగిసింది అన్నది తెర మీద చూడాలి.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ : జోగేంద్రగా రానా మరోసారి అదరగొట్టాడు. తన క్యారక్టరైజేషన్ విషయంలో దర్శకుడు తేజ ఎంత జాగ్రత్తపడ్డాడో దానికి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు రానా. తన ఇంతకుముందు ఇమేజ్ మొత్తం జోగేంద్ర ముందు నిలవకలేకపోయాయి. ఇక రాధగా హీరోయిన్ కాజల్ చేసిన రాధ పాత్ర, వీరిద్దరి మీద నడిచే ప్రతి సన్నివేశం ఆసక్తికరంగానే సాగింది. రిపోర్టర్ గా కేథరిన్ పరిధి మేరకు చేసింది. ఇక మిగతా పాత్రలన్ని సందర్భాన్ని బట్టి బాగా నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం : దర్శకుడు తేజ ఈసారి కథను ఆధారంగా చేసుకుని పనిచేయడం సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆయన పాలిటిక్స్ నైపథ్యంలో బలమైన ప్రేమ కథను చెప్పిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది. అంతేగాక కథకి కావాల్సిన పాత్రల్ని కూడా చాలా బలంగా రాసుకున్నారు తేజ. మొదటి భాగం ఎంతో తెలివిగా నడిపించాడో ఇక సెకండ్ హాఫ్ మాత్రం నిరాశ పరచాడని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అదుర్స్.. ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగుంటుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ మీద ఇంకా దృష్టి పెట్టాల్సి ఉంది. సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వడం వల్ల రిచ్ గా అనిపిస్తుంది.

విశ్లేషణ : బాహుబలి తర్వాత రానా చేసిన సినిమాగా నేనే రాజు నేనే మంత్రి తన నటన పీక్స్ అని చెప్పొచ్చు. ఎలాంటి పాత్రనైనా సరే రానా చేస్తే ఇక అది ఎలా ఉంటుంది అన్నది మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. సినిమా డైరక్టర్ తేజ ఫస్ట్ హాఫ్ ముఖ్యంగా మొదటి 45 నిమిషాలు స్పీడ్ గా నడిపించాడు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వస్తుందో ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెడుతుంది. సినిమాలో డైలాగ్స్ మాత్రం అదరగొట్టారు. ప్రతి సీన్ కు వారు రాసుకున్న డైలాగ్స్ బాగా హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల మీద నేనే రాజు నేనే మంత్రి ఓ మార్క్ గా చూపిస్తుంది. కమర్షియల్ అంశాల కోసం రాసుకున్న కామెడీ ట్రాక్ బాగుంది. అయితే మొదటి భాగం ఫాస్ట్ గా సాగడం వల్ల సెకండ్ హాఫ్ ఆ వేగాన్ని అందుకోకపోగా బోరింగ్ సీన్స్ అన్నట్టుగా సెంటిమెంట్ సీన్స్ వస్తాయి. సెకండ్ హాఫ్ నిరసంగా సాగినా కనీసం క్లైమాక్స్ అయినా సినిమాను నిలబెడుతుంది అంటే అది కూడా నిరాశ కలిగిస్తుంది. సినిమాకు ఇచ్చిన ప్రమోషన్ బూస్టింగ్ వల్ల సినిమా కచ్చితంగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యే అవకాశం ఉంది. యూత్ ఆడియెన్స్ కూడా నచ్చే అంశాలతో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి తప్పకుండా ఆడియెన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు. రానా నటన కోసమైనా ఈ సినిమా ఒకసారి చూడొచ్చు.