రివ్యూ : ఈ 'మహానుభావుడు' నవ్వించాడు

రివ్యూ : ఈ 'మహానుభావుడు' నవ్వించాడు

29-09-2017

రివ్యూ : ఈ 'మహానుభావుడు' నవ్వించాడు

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5

బ్యానర్ : యు వి క్రియేషన్స్
నటీనటులు : శర్వానంద్, మెహ్రిన్ ఫిర్జధా, వెన్నెల కిశోర్, నాజర్, రఘు బాబు తదితరులు...
సినిమాటోగ్రఫీ : నిజార్ షఫీ, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర్ రావు, సంగీతం : యస్ తమన్,
నిర్మాతలు : వి. వంశీ కృష్ణ రెడ్డి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మారుతి'

విడుదల తేదీ :29.09.2017


గతంలో పెద్ద హీరోల సినిమాలతో పోటీపడి విజయాల్ని అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ మరోసారి  ‘మహానుభావుడు’ చిత్రం ద్వారా ‘జై లవ కుశ, స్పైడర్’ వంటి భారీ సినిమాలకు పోటీగా దసరా బరిలోకి దిగాడు. మారుతితో దర్శకత్వం లో సక్సెస్ బ్యానర్ యు వి క్రియేషన్స్  నిర్మించిన  ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష తెలుసుకుందాం.

కథ :

ఆనంద్ (శర్వానంద్) ఓసిడి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్) అనగా అతి శుభ్రత అనే రోగంతో బాధపడుతుంటాడు. చూడటానికి అది రోగం గా కనిపించదు. అతిగా శుభ్రంగా ఉండటం పరిసరాలను శుభ్రంగా ఉండేలా జాగ్రత్తగా ఉండేళా చూసుకోవడం ఈ వ్యాధి లక్షణం. తన నీట్ అండ్ క్లీన్ తనకు కాబోయే భార్యకు ఉండాలని కోరుకునే  ఆనంద్ కు తన ఆఫీస్ లోనే జాయిన్ అవుతుంది మేఘన (మెహెరిన్ పిర్జాదా). తన అలవాట్లను చూసి ఆనంద్ ను ప్రేమించిన మేఘన ఆనంద్ లవ్ ప్రపోజల్స్ ను ఓకే చేస్తుంది. అయితే అతి శుభ్రత వల్ల తనకు కలిగే అసౌకర్యాన్ని ఆనంద్ ముందు ఉంచుతుంది మేఘన. అంతేకాదు తన తండ్రి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అప్పుడు కూడా  శుభ్రత గురించి ఆలోచించాడని అతని ప్రేమకు బ్రేక్ నిస్తుంది. అయినా సరే మేఘన తండ్రి సహాయంతో తన పుట్టి పెరిగిన ఊరికి వెళ్లి అక్కడ ఆమె ప్రేమను దక్కించుకోవాలని చూస్తాడు. ఇక ఊరి సర్పంచ్ పోటీలో కుస్తి యుద్ధం చేస్తేనే కాని గెలవరు అప్పటిదాకా మేనళ్లుడు తమ ఊరిపక్కన ఉండగా కూతురిని తనకు ఇవ్వట్లేదని పోటీగా వచ్చే ఊరికి సపోర్ట్ ఇస్తాడు. ఇక ఫైనల్ గా ఆ ఊరి పరువుని ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలిచాడు అన్నది అసలు సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

ఓసిడి రోగం  కలిగిన పాత్రలో హీరో శర్వానంద్ పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. డ్రెస్సింగ్ దగ్గర్నుంచి, ఇతరులతో ప్రవర్తించే తీరు, పరిస్థితులకు స్పందించే విధానాల్లో పర్ఫెక్షన్ చూపించి ఆద్యంతం ఆహ్లాదపరిచాడు. ఇక మెహ్రీన్, శర్వాల లవ్ ట్రాక్ కూడా కీలకంగా ఉండి ఎక్కడా బోర్ కొట్టలేదు. మెహ్రీన్ కూడా అందంగా కనిపిస్తూనే నటనతో ఆకట్టుకుంది.అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన అంతగా ఇంప్రెసివ్ అనిపించదు. వెన్నెల కిశోర్ పాత్ర త్రూ అవుట్ సినిమా మొత్తం ఉంటుంది కాని అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఊరి పెద్దగా నాజర్ పాత్ర ఎప్పటిలానే అలరించింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు మారుతి హీరోకి ఓసిడి అనే లక్షణాన్ని ఆపాదించి దాని ద్వారానే ఫన్ ను జనరేట్ చేస్తూ, నవ్వించే ఫన్నీ సన్నివేశాలతో, వాటికి కొంత ప్రేమను, చివర్లో ఎమోషన్ ను కనెక్ట్ చేసి సినిమా తీసిన విధానం బాగుంది. ఆరంభం నుండి చివరి వరకు ఎక్కడా బోర్ అనిపించకుండా కథనాన్ని నడిపిన ఆయన రచయితగా, దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశారు. సంగీత దర్శకుడు థమన్ సినిమాకు కావాల్సిన మంచి సంగీతాన్ని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చి తన వంతు న్యాయం చేశాడు.పాటలు కూడా వినడానికి, చూడడానికి బాగున్నాయి. థమన్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెప్పించాయి. నాజర్ షఫీ సినిమాటోగ్రఫీ చిత్రాన్ని చాలా అందంగా చూపించి ఆహ్లాదాన్నందించింది.

విశ్లేషణ :

ఈ సినిమా చూసిన తర్వాత మారుతి నాని కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా మైండ్ లోకి వస్తుంది. అక్కడ మతిమరుపు పెట్టి దాన్ని కవర్ చేసిన హీరో ఇందులో అతి శుభ్రత అంటూ కనిపిస్తాడు. అయితే కథ రొటీన్ అనిపించినా కథనంలో మాత్రం ఎక్కడ ఎంటర్టనింగ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడ్డాడు మారుతి. అక్కడ అతనికి మంచి మార్కులే పడ్డాయి. సినిమాను నిలబెట్టే సీన్స్ రెండు మూడు రాసుకుంటాడు. అవి కామెడీతో కడుపుబ్బా నవ్వించినా సినిమాకు అవి మంచి మైలేజ్ ఇస్తాయి. ఇదే ఫార్ములాను మారుతి ఈ సినిమాలో కూడా పెట్టాడు. కచ్చితంగా సినిమా ఓ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. అయితే కమర్షియాలిటీ లేకపోవడం కాస్త లాజికల్ గా స్క్రీన్ ప్లే ని నడిపించడం ఇబ్బందిగా ఉంటుంది. సినిమా మొత్తం తన క్యారక్టరైజేషన్ మీదే సీన్స్ రాసుకోవడం చాలా కస్టమైన పని. కచ్చితంగా ఈ సినిమా టైటిల్ కు యాప్ట్ అయ్యే సినిమా. మహానుభావుడు అంటే ఇలానే ఉంటాడేమో అనిపిస్తుంది. మారుతి శర్వానంద్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మహానుభావుడు మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.ఈ దసరా పండుగకి కుటుంబమంతా సరదాగా వినోదాన్ని పొందాలి అనుకుంటే ‘మహానుభావుడు’ సినిమాకి వెళితే చాలు.