రివ్యూ: 'మెంటల్‌ మదిలో...' సహజత్వం తో కూడిన వినోదం వుంది

రివ్యూ: 'మెంటల్‌ మదిలో...' సహజత్వం తో కూడిన వినోదం వుంది

25-11-2017

రివ్యూ: 'మెంటల్‌ మదిలో...' సహజత్వం తో కూడిన  వినోదం వుంది

తెలుగుటైమ్స్.నెట్  రేటింగ్ : 3/5

బ్యానర్‌: ధర్మపథ క్రియేషన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్,  
తారాగణం: శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌, శివాజీరాజా, అనితా చౌదరి, రాజ్‌ మదిరాజు, కిరీటి తదితరులు
కూర్పు: విప్లవ్‌ నైషదం, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
ఛాయాగ్రహణం: వేదరామన్‌, నిర్మాత: రాజ్‌ కందుకూరి
రచన, దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ

విడుదల తేదీ: 24.11.2017

‘పెళ్లి చూపులు’ సినిమాతో దాదాపు కొత్తవారిని పరిచయం చేసి మంచి విజయం అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన తాజా సినిమా ‘మెంటల్ మదిలో’. శ్రీ విష్ణు, నివేత పెతురాజ్, అమృత హీరో హీరోయిన్స్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ‘మెంటల్ మదిలో’ సినిమా ఈ రోజు  పేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:

సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయిన అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) ఓ కన్ ఫ్యూజ్ మనిషి. ఒకటికి మించి ఆప్షన్స్‌ వుంటే ఏది సెలక్ట్‌ చేసుకోవాలో తెలియని అయోమయానికి గురయ్యే హీరోకి జీవితంలో ఇద్దరు అమ్మాయిల మధ్య ఎవరు బెస్ట్‌ అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎలాంటి నిర్ణయాన్నైనా సరే ఒకసారి తీసుకోలేడు. ఈ క్రమంలో స్వేచ్చ (నివేదా పేతురాజ్)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. స్వతంత్ర భావాలు కలిగిన స్వేచ్చ ప్రతి విషయంలో తనకో క్లారిటీ ఉంటుంది. అలాంటి అమ్మాయి అరవింద్ కృష్ణతో ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుంది. ఇక ఎంగేజ్మెంట్ ముందు అరవింద్ కు ముంబై వెళ్తాడు. అక్కడ రేణు పరిచయం కావడంతో అరవింద్ కృష్ణలో మార్పులు వస్తాయి. ఇంతకీ అరవింద్ కృష్ణ, స్వేచ్చను పెళ్లి చేసుకున్నాడా..? వీరి ముగ్గురు కథ ఎలా ముగిసింది అన్నది అసలు సినిమా.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

అరవింద్ కృష్ణగా శ్రీవిష్ణు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. తనకేం కావాలో తనకే తెలియని ఓ కన్ ఫ్యూజ్ స్టేట్ లో శ్రీవిష్ణు కొత్తగా కనిపించాడు. ఇక సినిమాలో స్వేచ్చ పాత్ర ప్రాణమని చెప్పొచ్చు. ఆ పాత్రకు నివేదా పేరురాజ్ వంద శాతం  న్యాయం చేసింది. రేణు పాత్ర చేసిన అమృత కూడా ఆకట్టుకుంది. ఇక శివాజిరాజా హీరో తండ్రి పాత్రలో కొత్తగా కనిపించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం:

హీరో కన్‌ఫ్యూజన్‌ పోగొట్టడానికి అతని తండ్రి ఇచ్చే ఉదాహరణ టెర్రిఫిక్‌గా అనిపిస్తుంది. అలాగే తప్పేదో, రైట్‌ ఏదో తేల్చుకోలేని తన అయోమయం ఇద్దరు అమ్మాయిల్లో ఎవరి దగ్గర వుంటే పోతుందో, ఎవరైతే తనని సరిగ్గా గైడ్‌ చేస్తారో అనేది చిన్న ఫ్లవర్‌వేజ్‌ ఎగ్జాంపుల్‌తో చెప్పిన వైనం దర్శకుడి పరిపక్వతని తెలియజేస్తుంది. చిన్న పాయింట్ నే కథగా తీసుకున్న వివేక్ ఆత్రేయా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. కేవలం మూడు పాత్రల చుట్టూ అల్లుకున్న ఈ కథను దర్శకుడు చాలా తెలివిగా ప్రెజెన్స్ చేశాడు. సినిమా అంతా చాలా నీట్ గా ఎలాంటి ట్విస్టులు గందరగోళాలు లేకుండా తెరకెక్కించాడు. సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ విహారి ఆకట్టుకున్నాడు. వినసొంపైన పాటలతో నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. వేదరామన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. సినిమాతో రాజ్ కందుకూరి సినిమా పై వున్నా  ప్యాషన్ మరోసారి తెలుస్తుంది. పర్ఫెక్ట్ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించారు.

విశ్లేషణ:

ఓ క్యూట్ లవ్ స్టోరీతో వచ్చిన మెంటల్ మదిలో సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయా తన పనితనం చూపించాడు. మొదటి భాగం మొత్తం క్యారక్టర్ ఎస్టాబ్లిష్ తో నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ లో కథలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు. మన చుట్టూ జరిగే కథలా అనిపించడం అందనపు ఆకర్షణ. సినిమాలో నటీనటులు కూడా పాత్రలను ఓన్ చేసుకుని మరి నటించారు. ఇక సినిమాలో సెకండ్ హాఫ్ కొత్త పాత్ర ఇంట్రడ్యూసింగ్.. ఇక దాని వల్ల కథలో వచ్చే మార్పులు ఓ సున్నితమైన భావోద్వేగాలతో ముగిసే క్లైమాక్స్ ఇలా మదిని తాకే ఓ పసందైన సినిమాగా మెంటల్ మదిలో వస్తుంది. కథ చెప్పుకోవడానికి గొప్పగా లేకున్నా దాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మెంటల్ మదిలో మరో పెళ్లిచూపులు అని చెప్పొచ్చు. సినిమా యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ ఇలాంటి కన్ ఫ్యూజన్స్ ఏమి లేకుండా వెళ్లి చూసేయొచ్చు.