రివ్యూ : ప్రేక్షకుడిని 'హలో' అంటూ ప్రేమగా పలకరించిన అఖిల్

రివ్యూ : ప్రేక్షకుడిని 'హలో' అంటూ ప్రేమగా పలకరించిన అఖిల్

22-12-2017

రివ్యూ : ప్రేక్షకుడిని 'హలో' అంటూ ప్రేమగా పలకరించిన అఖిల్

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 3.5/5

బ్యానెర్లు : అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంట్రప్రెసెస్   
నటీనటులు : అఖిల్‌ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్‌, జగపతి బాబు, రమ్య కృష్ణన్, అజయ్ 
సినిమాటోగ్రఫర్ : పి. ఎస్‌. వినోద్‌, ఎడిటర్ : ప్రవీణ్‌ పూడి
సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, వనమాలి, శ్రేష్ఠ 
కథ:  విక్రమ్‌ కె. కుమార్‌, ముకుంద్ పాండే
నిర్మాత : అక్కినేని నాగార్జున
దర్శకత్వం, స్క్రీన్ ప్లే  : విక్రమ్‌ కె. కుమార్‌

విడుదల తేదీ: 22.12.2017

13B, 24, ఇష్క్, మనం వంటి విభిన్న తరహా చిత్రాలను అందించిన విక్ర‌మ్ కె.కుమార్ ఈ సారి ఓ చిన్ని పాయింట్ తో పెద్ద మ్యాజిక్ ను చూపించడానికి కొత్త‌గా కథను  త‌యారు చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అక్కినేని అఖిల్ హీరోగా చేసిన రెండవ సినిమా గా రి-ఇంట్రడక్షన్ మూవీ  ‘హలో’.  నాగార్జున అక్కినేని ఫామిలీ  నిర్మాతగా  రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి పాజిటివ్ బజ్ తో వుంది. మరి  ఈ సారైనా అఖిల్ సక్సెస్ కొట్టాడా? నాగార్జున డిసెంబర్ రిలీజ్ సెంటిమెంట్ ఫలించిందా సమీక్షలో చూద్దాం. 

కథ:

క‌థ‌గా చెప్పాలంటే తూనీగ తూనీగ అంటూ పాడుకున్న గత సూపర్ హిట్ మూవీ  మ‌న‌సంతా నువ్వే టైపు క‌థ‌. కానీ అందులో కన్న అమ్మ నాన్నలు, చెల్లి  వుంటారు ఇందులో పెంచిన  తల్లి దండ్రులు వుంటారు. శీను (అఖిల్) ఓ అనాధ.. చిన్నతనంలో తనని అభిమానించిన జున్ను అలియాస్ ప్రియ (కళ్యాణి ప్రియదర్శిని) దూరం చేసుకుంటాడు. ఆమె తనని వదిలి వెళ్లే టైంలో అతనికి 100 రూపాయల నోట్ మీద తన నెంబర్ రాసి వెళ్తుంది. కానీ ఆ నెంబర్ ను పోగొట్టుకున్న శీను జున్ను ఎప్పటికైనా తిరిగొస్తుందని 13 ఏళ్ల నుండి ఎదురుచూస్తూనే ఉంటాడు.  ఇక  ఈ లోగ  పిల్లలు లేని జగపతి బాబు, రమ్యకృష్ణలు శీనుని దత్తత తీసుకుంటారు. అప్పటి నుండి శీను అవినాష్ గా మారతాడు. ఇక పెద్దదైన జున్ను ఓ పెళ్లి కోసం హైదరాబాద్ వస్తుంది. శీను అయిన అవినాష్ ను కలుస్తుంది. అయితే తన సోల్ మెట్ తనే అని తెలియక ఇద్దరు కలిసి ఉన్నా వారి వారి  సోల్ మెట్స్ గురించి ఆలోచిస్తుంటారు. ఇంతకీ శీను జున్నులు కలిశారా..? వీరి ప్రేమ ఎలా నిలబడింది..? ఫైనల్ గా ఈ ఇద్దరిని ఎవరు కలిపారు అన్నది సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

అఖిల్ రీ లాంచింగ్ మూవీగా ఈ హలో ఉందని చెప్పొచ్చు. సినిమాలో అఖిల్ పర్ఫార్మెన్స్ బాగుంది. నటనలో చాలా పరిణితి కనబరిచాడు. యాక్షన్ సీన్స్ లో అయితే ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఇక ఎమోషనల్ సీన్స్ కూడా ఓకే. ఓవరాల్ గా సినిమా మొత్తం అఖిల్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. పాత్రని పెద్ద హాడావుడి లేకుండా కూల్ గా నడిపిస్తూ అతని చుట్టూ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ను బిల్డ్ చేశాడు.  హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని నటన బాగుంది. క్యూట్ లుక్స్ తో ఆమె ఆకట్టుకుంది. జగపతి బాబు, రమ్యకృష్ణల నటన ఈ చిత్రానికే హై లెట్ గా నిలిచారు. ఒకా నొక సందర్భంలో రమ్యక్రిష్ణ, జగపతిబాబుల నటనతో ప్రేక్షకుడి  కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. చిన్న పాత్రలో అజయ్ బాగానే అలరించాడు.

సాంకేతిక వర్గం పని తీరు:

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ ఫస్టాఫ్. సినిమాను మొదలుపెట్టడమే ఆహ్లాదకరంగా మొదలుపెట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఇంటర్వెల్ వరకు అలాగే కొనసాగించాడు.  చిన్న కథను బాగా డీల్ చేశాడు. చిన్నప్పుడు విడిపోయిన ప్రేమికులు ఫోన్ నెంబర్ ద్వారా ఎలా కలిశారు అన్న కథను బాగా తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే అక్కడక్కడ ట్రాక్ తప్పినా ఓవరాల్ గా సినిమా బాగుంది. ఇంటర్వెల్ సమయానికి హీరో హీరోయిన్లను దగ్గర చేసిన దర్శకుడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి రొమాంటిక్ ట్రాక్ ను నడపలేకపోయాడు. సినిమా ముఖ్య ఉద్దేశ్యం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ, అది గెలవడం అయినప్పుడు వారిద్దరి మధ్య దాని తీవ్రత, దాన్ని పొందడానికి వాళ్ళు పడే తపనను  హైలెట్ చేస్తే బాగుండేది. కానీ ఇందులో అలాంటివి పెద్దగా కనబడలేదు. ఇక పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్. ఫస్టాఫ్ లో వచ్చే యాక్షన్ స్టంట్స్ కొత్తగా, రియలిస్టిక్ గా అనిపించాయి ఫైట్స్ కంపోసింగ్ బాగుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే. అన్నపూర్ణ  ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముంది లైన్ ప్రొడ్యూసర్ సుప్రియ అన్ని పెర్ఫెక్ట్ గా మంచి  ప్లానింగ్ తో డీల్ చేస్తుంది.

విశ్లేషణ :

అఖిల్ రీ లాంచింగ్ మూవీగా హలో ఎంతో  గ్రాండ్ గా ఉంది. ఫీల్ గుడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా  కథ గతం లో వచ్చినా, అయితే స్క్రీన్ ప్లే నీట్ గా ప్రెజెంట్ చేశాడు విక్రం కుమార్. సినిమా మొదటి భాగం అందంగా తెరకెక్కించాడు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది మళ్లీ క్లైమాక్స్ తో నిలబెట్టాడు. సినిమా మొదలైన కొద్దిసేపటికే ఆడియెన్స్ మూవీతో ఇన్వాల్వ్ అవుతారు. ఈ విడిపోయిన రెండు పాత్రలు కలవడమే అనేది ముందుగా మనం ఊహించవచ్చు. అయితే ఈమధ్యలో దర్శకుడు  తన మేజిక్ తో చక్కని కథనంగా అలరించాడు. అఖిల్ యాక్షన్ ఎలిమెంట్స్ హైలెట్. ఫైట్స్ అందంగా తెరకెక్కించారు. పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. 'అఖిల్' సినిమా  తో ఫ్లాప్ కొట్టిన అఖిల్ ఈ హలోతో  నూరు శాతం మార్కులు  అందుకున్నట్టే. సెన్సిబుల్ లవ్ స్టోరీస్ కు ఎప్పుడు ప్రేక్షకులు గెలిపిస్తారు. హలో కూడా అలాంటి కోవకు చెందిన సినిమానే క్లైమాక్స్ లో ఎమోషన్ బాగా పండించారు. అయితే స్క్రీన్ ప్లే ఇంకాత టైట్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా అఖిల్ కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చే సినిమా, అన్నపూర్ణ బ్యానర్ లో మరో డిసెంబర్ రిలీజ్ హిట్.