రివ్యూ : అభిమానులు జై...బాలయ్య అనిపించే 'జై సింహ'

రివ్యూ : అభిమానులు జై...బాలయ్య అనిపించే 'జై సింహ'

12-01-2018

రివ్యూ : అభిమానులు జై...బాలయ్య అనిపించే 'జై సింహ'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 3/5

బ్యానర్ : సి.కే. ఎంటర్టైన్మెంట్స్
నటి నటులు : నందమూరి బాలక్రిష్ణ, నయనతార, హరిప్రియ, నటాషా దోషి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, మురళి మోహన్
జయ ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివ పార్వతి, ప్రియా తది తరులు నటించారు.
సినిమాటోగ్రఫీ : సి. రామ్ ప్రసాద్, మాటలు : ఏం.రత్నం, సంగీతం : చిరంతన్ బట్
పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, భాస్కర బట్ల, శ్రీ మణి, ఎడిటర్ : ప్రవీణ్ ఆంథోనీ
సహా నిర్మాతలు: సి.వెంకటేశ్వర్ రావు, నాగరాజు, నిర్మాత : సి.కళ్యాణ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.యస్.రవి కుమార్

విడుదల తేదీ : 12.01.2018

 

బొబ్బిలి 'సింహ'మ్, సమర'సింహ' రెడ్డి, నర'సింహ'నాయుడు, లక్ష్మినర'సింహ',  'సింహ' ఇంగ్లీష్ లో  లయన్'సింహ' ఇప్పుడు 'జై సింహ' నందమూరి బాలకృష్ణ కు సింహ అనే టైటిల్ సెంటిమెంట్ గా హిట్ టైటిల్ అని  గత సినిమాలు రుజువు చేసాయి ఈ సారి మరో   'నర సింహ' డైరెక్టర్ కె యస్ రవికుమార్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా ఈ రోజు విడుదల అయినా 'జై సింహ' తో మరో సారి  ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యిందో లేదో రివ్యూ లో చూద్దాం...

కథ:

నరసింహ (బాలక్రిష్ణ) అప్పుడే పుట్టిన తన కొడుకుతో వైజాగ్ వదిలేసి అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు తిరుగుతూ చివరికి కుంభకోణంకు చేరుకుంటాడు. అలా అక్కడే డ్రైవర్ గా పని చేసుకుంటున్న అతనికి ఒక ఇన్సిడెంట్ ద్వారా గతంలో తాను ప్రేమించిన అమ్మాయి గౌరి (నయనతార) ఎదురవుతుంది. కానీ అప్పటికే ఆమె అతనిపై ద్వేషం పెంచుకుని, అసహ్యించుకునే స్థాయిలో ఉంటుంది. అసలు నరసింహ కొడుకుతో సహా వైజాగ్ వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు ? ప్రాణంగా ప్రేమించిన గౌరి అతన్ని ఎందుకు శత్రువులా చూస్తుంది ? తన కొడుకుకి తల్లి ఎవరు? అతని గతమేమిటి ? అనేదే సినిమా.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

నర సింహ పాత్రధారి  నట సింహ బాలక్రిష్ణే నటనే ఈ సినిమా కు హైలెట్   ఆద్యంతం అభిమానించే వాళ్ళ కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని నరసింహ పాత్రలో బాలయ్య జీవించారు. ఎక్కడా అభినయాన్ని వేరే కోణంలోకి తీసుకెళ్లకుండా ఒకేలా నటించి మెప్పించారు. ప్రత్యేకంగా డాన్స్ మొమెంట్స్ లో  కుర్ర హీరో లను తలదన్నేలా  స్టెప్స్ వేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు.   ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో ఆయన నటనకు చప్పట్లు కొట్టాల్సిందే. ఫైట్స్, డైలాగ్స్,  తన మాస్ మార్క్ ప్రదర్శించి అక్కడ కూడా ఆకట్టుకుని హీరోగా సినిమాకు ఎంత చేయాలో అంతా చేశారు బాలయ్య. అలాగే  ఫస్ట్ హాఫ్ లో  వచ్చే బ్రహ్మానందం తాలూకు కామెడీ ఓల్డ్ ఫార్మాట్లోనే ఉంటూ ఒకానొక దశలో, ఇంకా ఎంతకాలం చూస్తాము బాబు... ఇక  నీవు రిటైర్ అవ్వు బాబు...  అనే ఫీలింగ్ ప్రేక్షకులకు  కలిగిస్తుంది. కథానానికి ముఖ్యమైన ప్రతినాయకులు, హీరో మధ్య వైరం చాలా బలహీనంగా ఉండటంతో బాలయ్య పాత్రలో కూడా తీవ్రత కొంత లోపించింది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఉంటే ఫలితం ఇంకాస్త బెటర్ గా ఉండేది. కథలో నాయనతారకు తప్పించి మిగతా హీరోయిన్లకు అంత ఇంపార్టెన్స్ లేదు.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు కె.ఎస్. రవికుమార్  స్క్రీన్ ప్లే, టేకింగ్లో  కొత్తదనం వుంది కానీ కథకు సరిపడా  వేగం పెద్దగా కనబడక జస్ట్ ఓకే అనే స్థాయిలోనే ఉంది. పైగా బాలకృష్ణ లాంటి హై వోల్టేజ్ వున్నా నటుడిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. రచయిత ఏ.ఎం.రత్నం సినిమాకు అందించిన కథ పాతదే కానీ అందులోని కీలకమైన మలుపులు, సన్నివేశాలు బాగున్నాయి. బాలయ్య పాత్రకు ఆయన రాసిన డైలాగ్స్ కనెక్టయ్యాయి. అలాగే చిరంతన్ భట్ అందించిన పాటల సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ యావరేజ్ గానే ఉన్నాయి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ పద్దతిగానే ఉన్నా కొంత పాతబడిన సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగింది. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ ద్వారా కొన్ని అనవసరమైన సన్నివేశాలని తొలగించి ఉండాల్సింది. నిర్మాత సి.కళ్యాణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

బాలక్రిష్ణ గత హిట్ సినిమాల తాలూకు ఛాయలు ప్రతిచోటా కనిపిస్తూనే ఉంటాయి. దాంతో సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి పెద్దగా ఎగ్జైట్ ఫీలయ్యే ఛాన్స్ దొరకదు. అంతేగాక కె.ఎస్. రవికుమార్ స్క్రీన్ ప్లే కూడా పాత తరహాలోనే ముందు హీరో ప్రస్తుత కథ, ఆ తర్వాత అతని గతం, చివర్లో మళ్ళీ ప్రస్తుతం అన్నట్టే ఉంటుంది కానీ ఎక్కడా కొత్త పోకడ, వేగం కనిపించదు.సెకండాఫ్లో వచ్చే ముఖ్యమైన బాలయ్య గత జీవితం చెప్పడానికి, వినడానికి బాగానే ఉంది కానీ చూడటానికి అంత ఆసక్తికరంగా, ఎగ్రెసివ్ గా లేదు. ముఖ్యంగా కథానాయకుడి పాత్ర స్వభావాన్ని, అతని లవ్ ట్రాక్ ను వివరించడానికి తీసిన సన్నివేశాలు మరీ రొటీన్ గా ఉండి కొంత బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. కొందరు ముఖ్యమైన నటుల నటన అస్సలు బాగోలేదు.ఫస్టాఫ్ కుంభకోణం బ్యాక్ డ్రాప్లో వచ్చే బ్రహ్మాణుల గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను వివరించే సన్నివేశం చాలా బాగుంది. అందులో కట్ లేకుండా బాలయ్య చెప్పిన డైలాగ్ ఔరా అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి ‘జై సింహ’ తో బరిలోకి దిగిన బాలక్రిష్ణ పర్వాలేదనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. అభిమానులు గర్వపడే స్థాయిలో ఉండే బాలక్రిష్ణ నటన, ఇంటర్వెల్ బ్లాక్, హృదయాలను హత్తుకునే ఎమోషనల్ క్లైమాక్స్, కొన్ని బలమైన సన్నివేశాలు ఈ సినిమాలో మెప్పించే అంశాలు  మొత్తం మీద కొంత పాతగా, రొటీన్ గా ఉన్న ఈ ‘జై సింహ’ చిత్రం బాల కృష్ణ  అభిమానులచే మరో సారి 'జై బాలయ్య'  అనిపించి వారిని  మెప్పించేలా, సాధారణ ప్రేక్షకులకు పర్వాలేదనిపించేలా ఉంది.