రాష్ట్రపతి అభ్యర్థిపై ఇక మోడీ ముద్ర
APEDB

రాష్ట్రపతి అభ్యర్థిపై ఇక మోడీ ముద్ర

13-03-2017

రాష్ట్రపతి అభ్యర్థిపై ఇక మోడీ ముద్ర

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పుడు మరింత బలంతో రాజకీయంగా పావులు కదపనున్నారని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు నరేంద్రమోదీ మాటనే చెల్లనున్నది. గతంలో మిత్రపక్షాల సహకారంతో ప్రతిపక్షాల మద్దతుతో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపికచేయాల్సిన అగత్యం ఏర్పడింది. నిన్నటి ఎన్నికల్లో బిజెపి విజయాన్ని సాధించడంతో ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా నిలబెట్టి, గెలిపించుకునే సత్తా లభించింది.  ఎప్పటి నుంచో బీజేపీ కల ఇప్పుడు నరేంద్రమోదీ ద్వారా నెరవేరనున్నది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లో గెలుపుతో మోడీ చెప్పిన వ్యక్తి రాష్ట్రపతి కానున్నారు. ఈ ఏడాది జూలైలో ప్రణబ్‌ ముఖర్జీ పదవీ విరమణ చేయనున్నారు. జూన్‌లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, దేశంలోని అన్ని అసెంబ్లీల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. వీరిలో ఒక్కో ఎంపీ ఓటు విలు 708 ఓట్లు. ఇక, ఎమ్మెల్యే ఓటు విలుల ఆయా రాష్ట్రాల్లోని జనాభాను బట్టి ఉంటుంది. గరిష్ఠంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ కనిష్ఠంగా 8  మాత్రమే. ఇక ఉత్తరాఖండ్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 64, పంజాబ్‌ 116, గోవా 20, మణిపూర్‌ ఎమ్మెల్యే ఓటు విలువ 18, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల కాలేజీలో మొత్తం 10.98 లక్షల ఓట్లు ఉన్నాయి.

రాష్ట్రపతి  ఎన్నికకు సంబంధించిన మేజిక్‌ మార్కు 5.49 లక్షల ఓట్లు. ఆలాగే , ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం ఓటర్లు 4896. వీరిలో ఎమ్మెల్యేలు 4120 కాగా ఎంపీలు 776. బీజేపీకి ఇప్పటికే 282 లోక్‌సభ,  56 రాజ్యసభ ఎంపీలు 1126 మంది ఎమ్మెల్యేలు (ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు) ఉన్నారు. రాష్ట్రపతిని సొంతంగా గెలిపించుకోవడానికి ఎన్డీయేకి ఇంకా 75,076 ఓట్లు కావాలి. కానీ, ఎలక్టోరల్‌  కాలేజీలో ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఓట్లు 1,03,756. తాజా ఫలితాలతో ఒక్క యాపీ నుంచే ఎన్డీయేకు 67,600 ఓట్లు వచ్చాయి. ఉత్తరాఖండ్‌ నుంచి 3648 ఓట్లు వచ్చాయి. ఇక, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ల్లో బీజేపీ వచ్చిన సీట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే, ఎవరినీ బతిమాలాడకుండానే ఎన్డీయే తన అభ్యర్థిని రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టగలదు.