తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జే తాళ్ళూరి - శ్రీనివాస గోగినేని

తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జే తాళ్ళూరి - శ్రీనివాస గోగినేని

22-04-2017

తానా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జే తాళ్ళూరి - శ్రీనివాస గోగినేని

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల ప్రకటన వెలువరించగానే తానా అధ్యక్ష పదవులకు పోటీ చేస్తున్నట్లు జే తాళ్ళూరి, శ్రీనివాస గోగినేని ప్రకటించారు. వీరిద్దరి ప్రకటనతో తానా ఎన్నికలు వేడిని అందుకుంది.  తానాలో ఎన్నికల ప్రకటనకు ముందే ఆశావహులైన అభ్యర్థులు తమ తమ ప్రాంతాల్లో ఉన్న తమకు తెలిసినవారందరినీ తానాలో సభ్యులుగా చేర్పించే పనిని ముమ్మరంగా చేసి తానా సభ్యత్వాల సంఖ్యను రెట్టింపు చేశారు. దీనిపై కొంతమంది ఆరోపణలు వ్యక్తం చేయడంతో దీనిపై తానా ఉన్నత నాయకత్వం ఓ కమిటీని నియమించింది. మరోవైపు తానా నామినేషన్ల ప్రక్రియకు గడువు సమీపిస్తుండటంతో ఇప్పడిప్పుడే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకులు ఇతరులతో తాము పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్న విషయమై చర్చించుకుంటున్నారు. మరికొంతమంది తమకు లభించే ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఏ పదవులకు పోటీ పడాలన్నదానిపై ఆలోచన చేస్తున్నారు.

తానా అధ్యక్ష పదవికి తాము పోటీపడుతున్నట్లు జే తాళ్ళూరి, శ్రీనివాస గోగినేని ప్రకటించడంతో పోటీ చేయాలనుకున్న చాలామంది తాము ఏ వైపు ఉంటే గెలుపు లభిస్తుందన్న దానిపై అంచనాలను వేసుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థులు కూడా వివిధ పదవులకు తమ ప్యానల్‌ అభ్యర్థులను  ఎంపిక చేసుకునే విషయమై సమాలోచనలు చేస్తున్నారు.