తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జే తాళ్ళూరి
Sailaja Reddy Alluddu

తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జే తాళ్ళూరి

22-04-2017

తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జే తాళ్ళూరి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తానా నాయకుడు జే తాళ్ళూరి ప్రకటించారు. తానాలో సీనియర్‌ నాయకునిగా గుర్తింపు ఉన్న జయశేఖర్‌ తాళ్ళూరి తానాలో వివిధ పదవులను అధిరోహించారు. తానా తరపున అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలను జే తాళ్ళూరి నిర్వహించారు. తన కుటుంబానికి చెందిన తాళ్ళూరి పంచాక్షరయ్య ట్రస్ట్‌ ద్వారా కూడా ఖమ్మం జిల్లాలోనూ ఇతర చోట్ల కూడా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించి గుర్తింపును పొందారు. తానా అధ్యక్షునిగా ఎన్నికైతే మరిన్ని సేవా కార్యక్రమాలను మరింతగా చేయవచ్చన్న ఆలోచనతో తానా అధ్యక్ష పదవికి ఆయన పోటీ పడుతున్నారు.