కన్నులపండువగా టిఎజిడివి సంక్రాంతి వేడుకలు

కన్నులపండువగా టిఎజిడివి సంక్రాంతి వేడుకలు

22-04-2017

కన్నులపండువగా టిఎజిడివి సంక్రాంతి వేడుకలు

ఫిలడెల్పియాలో గ్రేటర్‌ డెలావేర్‌ వ్యాలీ తెలుగు సంఘం (టిఎజిడివి) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జనవరి 21వ తేదీన హార్లేస్‌విల్లేలోని ఇండియన్‌ వ్యాలీ మిడిల్‌ స్కూల్‌లో జరిగిన సంక్రాంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ హరినాథ్‌ బుంగతవుల వచ్చిన అతిధులకు ఇతరులకు కమిటీ తరపున ఘనంగా స్వాగతం పలికారు. దాదాపు 500 మంది ఈ వేడుకలకు వచ్చారు. అశ్రిత, శ్రేయ ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

నరసింహారెడ్డి దొంతిరెడ్డి, ఆలేఖ్య ఇంద్రకంటి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అభినవ్‌ మేది, అదితి గొల్లకోట, అమృత పరుచూరి, అనన్య గొల్లకోట, అంజలి గౌరీ తాళ్ళూరు, అవంతిక మన్న, చరిత కుంట, దేవేశ్‌ బుంగతవుల, ధ్యుతి తారా క్రొత్తపల్లి, హాసిని మట్ట, హరిక నల్లమల, క్రిష్టిత నందమూరి, కృష్ణకాంత్‌ కటకోట, మహి నూతనపాటి, మనస్విని వల్లభు, మేథా ప్రకాష్‌ కురుకుంద, మేథా శ్రీ ఏదర, మీరా మే రెడ్డి, మేఘనాథ్‌ వాసిరెడ్డి, నవ్యశ్రీ సాయి కుందుల, రిషి రామాయణం, రోహణ్‌ కుంద్రిమోతి, రోనక్‌ దేమగు, సాయి కొత్తపల్లి, శ్రేయ అతుకూరి, శ్రీనిధి దందిభొట్ల, శ్రీనిజ దందిభొట్ల, శ్రుతిక చేబ్రోలు, స్నేహ ఇంద్రకంటి, శ్రీనిధి యరత, శ్రీహిత యనమంద్ర, శ్రీనివాస్‌ పోతుకూచి, శ్రీవిద్య కర్ర, సుహాస్‌ రకొతు, తిష్య దినేష్‌, వర్ష ఏదర, వెంకట్‌ బాయిరెడ్డి, వరేన్య గోనె, యషిత తోట, యుక్తా సాయిశ్రీ బుంగవతుల తదితరులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. దక్కన్‌ బిర్యానీ వాళ్ళు సంక్రాంతి గిఫ్ట్‌లు, ఫుడ్‌లను ఏర్పాటు చేశారు.

అరుణ-రాజగోపాల్‌ దనిసెట్టి ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, సంక్రాంతి వాతావరణం కనిపించేలా వేదిక అలంకరణ వంటివి ఆకట్టుకున్నాయి. కార్యదర్శి కిరణ్‌ కొత్తపల్లి వోట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌ చెప్పారు. టీఎజిడివి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు హరినాథ్‌ బుంగతవుల, వైస్‌ ప్రెసిడెంట్‌ సాంబయ్య కోటపాటి, సెక్రటరీ కిరణ్‌ కొత్తపల్లి, ట్రెజరర్‌ విజయ్‌ భాస్కర్‌ పోలంరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ నిషిత వెంకన్నగారి, జాయింట్‌ ట్రెజరర్‌ విజయ్‌ వీరమాచనేని, మెంబర్స్‌ ఎట్‌ లార్జ్‌ శివ అనంతుని, అనుపమ దొంతినేని, మధుసూధన్‌ రెడ్డి గొనిపాటి, లక్ష్మీ ముద్దన, కృష్ణ నందమూరి, అరవింద్‌ పరుచూరి, ముజిబుర్‌ రెహ్మాన్‌ తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.

Click here for Event Gallery