నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాసాంధ్రులు చురుకైన పాత్ర

నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాసాంధ్రులు చురుకైన పాత్ర

24-04-2017

నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రవాసాంధ్రులు చురుకైన పాత్ర

విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు నవ్యాంధ్ర నవ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కోరారు. అమెరికాలో పర్యటిస్తున్న కోడెల చికాగోలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా సొంత కాళ్లపై నిలబడేసత్తా తెలుగువారికి ఉందని నిరూపించుకోవలసిన తరుణం ఆసన్నమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఏకగవాక్ష విధానంలో అన్ని అనుమతులు సులభంగా లభిస్తాయన్నారు. తెలుగుజాతి ప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన ఘనత ఎన్‌టీ రామారావుకు దక్కుతుందని అన్నారు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా దక్షతకు నిదర్వనమన్నారు.  ఈ సమావేశంలో అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం పాల్గొన్నారు.