చికాగో ఎన్ఆర్ఐ తెలుగుదేశం సమావేశంలో కోడెల

చికాగో ఎన్ఆర్ఐ తెలుగుదేశం సమావేశంలో కోడెల

24-04-2017

చికాగో ఎన్ఆర్ఐ తెలుగుదేశం సమావేశంలో కోడెల

జీవితంలో ఎంత ఎదిగినా కన్నతల్లి, జన్మభూమిని మరువరాదని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. అమెరికాలోని షికాగో సమీపంలో నేపర్‌విల్లి పట్టణంలో జరిగిన ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఆయన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డితో  పాల్గొన్నారు.తరువాత బ్లూమింగ్టస్‌- నార్మల్‌ లో తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికీ హాజరయ్యారు బ్లూమింగ్టన్‌-నార్మల్‌ పురవీధుల్లో కార్లతో ప్రదర్శన కూడా నిర్వహించారు. షికాగో ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం నేత హేమచంద్ర శేఖర్‌ కానూరు, గంగాధర్‌ నాదెండ్ల, యుగంధర్‌ యడ్లపాటి, హనుమంతరెడ్డితో పాటు తెలుగుయువత కార్యకర్తలు వెంకట్‌, కృష్ణ వైట్ల, రాజేశ్‌ యార్లగడ్డ, కృష్ణ కన్నెగంటి, బూస శివ, కొసరాజు శ్రీనివాస్‌, లేళ్ల సాంబశివరావు, అప్పన పెదిరెడ్డి, మిక్కిలినేని శ్రీనివాస్‌ తదితరులు సభాపతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నార్మల్‌ నగర ఉత్తమ పౌరుడు అవార్డు గ్రహీత ఎం.వెంకటేశ్వరరావును ఈ సందర్భంగా  కోడెల సత్కరించారు.