అమెరికాలోని 10 నగరాల్లో విజయవాడ కనకదుర్గ పూజలు
Telangana Tourism
Vasavi Group

అమెరికాలోని 10 నగరాల్లో విజయవాడ కనకదుర్గ పూజలు

26-04-2017

అమెరికాలోని 10 నగరాల్లో విజయవాడ కనకదుర్గ పూజలు

ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమెరికాలోని 10 నగరాల్లో కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలను ఏప్రిల్‌ 22 నుంచి నిర్వహిస్తున్నారు. అమెరికాలోని తెలుగువారి పత్రిక 'తెలుగు టైమ్స్‌', పాఠశాల ఈ పూజలను కో ఆర్డినేట్‌ చేస్తోంది. జగజ్జననీ, త్రిశక్తి స్వరూపిణి అయిన కనకదుర్గ అమ్మవారిని పూజిస్తే సకల దోషాలు, సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అమెరికాలోని భక్తుల కోరిక మేరకు అమ్మవారి కుంకుమ పూజలను వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర ఆజాద్‌ తెలిపారు. ఒక్కో రాష్ట్రంలో వారానికి రెండురోజులపాటు త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్రనామార్చన వంటి పూజలను నిర్వహించనున్నారు.

తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, ఏప్రిల్‌ 23వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కోలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో జరిగే పూజతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, తరువాత ఒక్కోవారం ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సియాటెల్‌, పోర్ట్‌లాండ్‌, న్యూజెర్సి, వాషింగ్టన్‌ డిసి, జాక్సన్‌ విల్లే, ఓర్లాండో, డాలస్‌, అస్టిన్‌లతోపాటు చికాగోలో ఈ కుంకుమపూజలు జరుగుతాయని సుబ్బారావు వివరించారు.