న్యూజెర్సిలో కుంకుమ పూజలకు ప్రారంభమైన ఏర్పాట్లు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

న్యూజెర్సిలో కుంకుమ పూజలకు ప్రారంభమైన ఏర్పాట్లు

27-04-2017

న్యూజెర్సిలో కుంకుమ పూజలకు ప్రారంభమైన ఏర్పాట్లు

న్యూజెర్సిలో విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ ధనలక్ష్మీ ట్రస్ట్‌, తెలుగుటైమ్స్‌, పాఠశాల కలిపి నిర్వహిస్తున్న ఈ వేడుకలను న్యూజెర్సిలోని తెలుగు ప్రముఖుడు, కంప్యూగ్రా అధినేత రామ్‌మోహన్‌ వేదాంతం పర్యవేక్షిస్తున్నారు. స్థానిక తెలుగు సంఘం తెలుగు కళాసమితి న్యూజెర్సి నిర్వహించిన ఉగాది వేడుకల్లో కుంకుమ పూజల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 6,7 తేదీల్లో  వైఎంసిఎ లొకేషన్‌లో ఉన్న స్వామినారాయణ టెంపుల్‌లో ఈ కుంకుమ పూజలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రామ్‌మోహన్‌ వేదాంతంతోపాటు, తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు, సత్యనేమన తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఇతర వివరాలకు రామ్‌మోహన్‌ వేదాంతంను 732 543 4655లో సంప్రందించవచ్చు.

http://www.sridhanalakshmitrust.org/events/