హ్యూస్టన్ లో ఘనంగా కుంకుమార్చన పూజలు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

హ్యూస్టన్ లో ఘనంగా కుంకుమార్చన పూజలు

27-04-2017

హ్యూస్టన్ లో ఘనంగా కుంకుమార్చన పూజలు

హ్యూస్టన్‌లోని షిర్డిసాయి జలరామ్‌మందిర్‌లో మే 20, 21 తేదీల్లో జరిగిన విజయవాడ కనక దుర్గ  అమ్మవారి కుంకుమార్చన పూజలకు భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పూజారులు శంకర శాండిల్య, లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు విజయవాడ ఆలయ పిఆర్‌ఓ అచ్చుతరామయ్య, ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగేలా చూశారు. భక్తుల చేత శాస్త్రోక్తంగా అమ్మవారి కుంకుమార్చనలతోపాటు, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్రనామ పారాయణం వంటివి చేయించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదంతోపాటు డాలర్‌, శేషవస్త్రాలను బహూకరించారు. తానా మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేశారు. 


Click here for Event Gallery