సాన్‌ ఆంటోనియోలో సద్దుల బతుకమ్మ సంబరాలు
Ramakrishna

సాన్‌ ఆంటోనియోలో సద్దుల బతుకమ్మ సంబరాలు

27-04-2017

సాన్‌ ఆంటోనియోలో సద్దుల బతుకమ్మ సంబరాలు

టెక్సాస్‌లోని సాన్‌ అంటోనియో నగరంలో తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ సాన్‌ ఆంటోనియా (టాగ్స్‌) నేతృత్వంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలలో ఆడబిడ్డలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో కోలాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలాడుతూ మహా గౌరీదేవిని బతుకమ్మగా పూజించారు. రంగురంగుల పూలతో  అలంకరించిన బతుకమ్మను నీటి కొలను వరకు ఊరేగించి పోయి రావమ్మా అంటూ నిమజ్జనం చేసి ఆ పై వెంట తెచ్చుకొన్న సద్దులు, నువ్వల పొడి, పల్లీపోడి, కొబ్బరి పోళ్లను అందరితో పంచుకొని వీడుకోలు చెప్పారు. సాన్‌ ఆంటోనియోలో  గత ఏడెమినిమిదేళ్లుగా సంప్రదాయంగా జరుపుకొంటున్న ఈ బతుకమ్మ వేడుకలలో అతి పెద్ద సంఖ్యలో హాజరైన తెలంగాణ వాసులకు టాగ్సా కార్యవర్గ సభ్యులు, కార్యక్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.