చండీయాగం చరిత్రాత్మకమవుతుంది

చండీయాగం చరిత్రాత్మకమవుతుంది

28-04-2017

చండీయాగం చరిత్రాత్మకమవుతుంది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న చండీయాగం చరిత్రాత్మకమవుతుందని శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి అన్నారు. కర్ణాటకలోని శృంగేరి పీఠానికి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నిర్వహిస్తున్న చండీయాగానికి రావాలంటూ భారతీ తీర్ధస్వామికి ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా భారతీ తీర్థస్వామి మాట్లాడుతూ  దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతటి మహాకార్యాన్ని చేపట్టలేదని, ఇది విజయవంతం కావాలని ఆయన ఆశీర్వదించారు. యాగం నిర్వఘ్నంగా, ప్రశాంతంగా జరగాలని, ఇది చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు. యాగ ఫలం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని తెలిపారు. యాగంలో పాల్గొనే రుత్వికులు చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వహించాలని సూచించారు.