యాగానికి అందరూ ఆహ్వానితులే

యాగానికి అందరూ ఆహ్వానితులే

28-04-2017

యాగానికి అందరూ ఆహ్వానితులే

అయుత చండీ మహాయాగానికి అందరూ ఆహ్వానితులేనని, ఎలాంటి అభ్యంతరాలు లేవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఎర్రవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40వేల మందికి ఆహ్వానాలు పంపామన్నారు. ఆరు, ఏడు రాష్ట్రాల నుంచి రుత్వికులు యాగానికి వస్తున్నారని తెలిపారు. ప్రధానంగా 15వందల మంది రుత్వికులు ఏకకంఠంగా యాగం చేస్తారని చెప్పారు. రోజు 50వేల మందికి పసుపు కుంకుమలు, అమ్మవారి ప్రసాదం అందజేస్తామన్నారు. భక్తులు స్యీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. యాగశాలను 8వేల నుంచి 9వేల మంది దర్శించుకునే వీలు ఉంటుందని తెలిపారు. మహిళలు భారీగా వచ్చినా కుంకుమ అర్చనలు చేసుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు.