చండీ యాగానికి హాజరైన గవర్నర్ దంపతులు

చండీ యాగానికి హాజరైన గవర్నర్ దంపతులు

28-04-2017

చండీ యాగానికి హాజరైన గవర్నర్ దంపతులు

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌  నరసింహన్‌ దంపతులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. 

యాగానికి విచ్చేసిన  ప్రముఖులు : 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పండిట్‌ రవిశంకర్‌, రామోజీరావుతో పాటు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఈటలె రాజేందర్‌, చందులాల్‌, జగదీశ్‌రెడ్డి,  సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ,  స్వామిగౌడ్‌,  డీఎస్‌,  కవిత, కేశవరావు, పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు  హాజరైయ్యారు.

Click here for PhotoGallery