200 ఏళ్ల చరిత్రలో అయుత చండీయాగం ఎవరూ చేయలేదు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

200 ఏళ్ల చరిత్రలో అయుత చండీయాగం ఎవరూ చేయలేదు

28-04-2017

200 ఏళ్ల చరిత్రలో అయుత చండీయాగం ఎవరూ చేయలేదు

గడిచిన 200 ఏళ్ల చరిత్రలో ఎవరూ ఆయుచ చండీయాగం నిర్వహించిన దాఖలాలు లేవని శృంగేరి పీఠం ముఖ్య కార్యనిర్వహణ అధికారి గౌరీ శంకర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌కు శృంగేరి పీఠాధిపతి ఆశీర్వాదం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శృంగేరి పీఠాధిపతి భారతితీర్థస్వామి ఆశీస్సులు అందజేశారు. మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి శృంగేరి పీఠం నుంచి ప్రత్యేక దూతగా వచ్చిన శృంగేరి పీఠం ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌరిశంకర్‌ పీఠాథిపతి తరపున ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుత్విజులతో యాగశాల మినీ ఇండియాను తలపిస్తోందన్నారు. ధర్మరాజు రాజుసూయ యాగం తరహాలో ఈ యాగాన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ప్రజం సంక్షేమం కోసం చేస్తున్న ఈ యాగం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన ఈయాగం సంపూర్ణంగా  నెరవేరాలని కాంక్షిస్తున్నట్లు తెలిపారు.


Click here for PhotoGallery