కేసీఆర్‌ యాగానికి బాబు హెరిటేజ్‌ సాయం

కేసీఆర్‌ యాగానికి బాబు హెరిటేజ్‌ సాయం

28-04-2017

కేసీఆర్‌ యాగానికి బాబు హెరిటేజ్‌ సాయం

కేసీఆర్‌ నిర్వహిస్తున్న యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కేసీఆర్‌ స్వయంగా విజయవాడ వెళ్లి మరీ ఆహ్వానించి వచ్చారు. కేసీఆర్‌కు కూడా చంద్రబాబు సకల మర్యాదలు చేసి పంపారు. అయితే నిన్న ప్రారంభమైన మహా యాగం కోసం దాదాపు 4వేల కేజీల ఆవు నెయ్యిని సేకరించారు. ఈ నెయ్యిలో దాదాపు 50 శాతం వరకు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ నుంచి సేకరించారట. ఈ యజ్ఞానికి ఆవు నెయ్యి సేకరణ కోసం చాలా కష్టపడ్డారట. అంత ఆవు నెయ్యి ఒకేసారి దొరకడం చాలా కష్టం. యాగం కోసం హెరిటేజ్‌ ఆవు నెయ్యిని వాడుతున్నట్టు ముందుగానే అక్కడ నిర్వహణ చూస్తున్న వారు కేసీఆర్‌కు చెప్పారట. కేసీఆర్‌ కూడా అమరావతి వెళ్లిన సమయంలోనే నెయ్యి విషయాన్ని బాబుకు చెప్పారనే టాక్‌. ఆయన కూడా ఎంత ఉంటే అంత తీసుకెళ్లండి. నేను కూడా ఓ మాట చెబుతానని చెప్పారట. రెడీ మేడ్ గా హెరిటేజ్ దగ్గర కల్తీ లేని ఆవు నెయ్యి ఉంటుందనే ఉద్దేశంతో తీసుకున్నారట. బాబు కూడా మాట సాయం చేశారట. ఇక ఇతర డెయిరీల నుండి కూడా సేకరించినా తమ స్నేహితుడు డెయిరీ నుండి కూడా ఆయన కొంత తెప్పించారని ప్రచారం జరుగుతోంది.