భక్తులు స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటించాలి
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

భక్తులు స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటించాలి

28-04-2017

భక్తులు స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటించాలి

సాధారణ భక్తులు మరింత సౌకర్యవంతంగా యాగంలో పాల్గొనేందుకు, యాగ ప్రక్రియను తిలకించేందుకు విఐపిలు, భక్తులు స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పాటించాలని నీటీ పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు కోరారు. విఐపిలు తమ వెంట ఎక్కువ సంఖ్యలో వాహనాలు తేవద్దని, వాహనాల పార్కింగ్‌ సమస్య తలెత్తుతున్నదని చెప్పారు. విఐపిలు తమ వెంట ఎక్కువమందిని తీసుకురావద్దని, నలుగైదురికి మించి లేకుండా చూసుకోవాలని కోరారు.  కేవలం ఉదమం మాత్రమే దర్శనం చేసుకోవాలనే నియమం లేదని అన్నారు. రాత్రి 10 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టీ అప్పటీ దాక భక్తులు దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. యాగశాలకు వచ్చిన భక్తులు ప్రదక్షిణ, దర్శనం తర్వాగా చేసుకుని ముందుక సాగాలని, తద్వారా మిగతా భక్తులకు అవకాశం కల్పించాలని కోరారు.