చండీయాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య

చండీయాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య

28-04-2017

చండీయాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో జరుగుతోన్న అయుత చండీ మహా యాగానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ రోశయ్యకు శాలువా కప్పి  సన్మానించారు.  అమ్మవారి వద్ద నుంచి తీసుకొచ్చిన పూలమాల వేసి సత్కరించారు. అమ్మవారి వెండి ప్రతిమను అందజేశారు. ఇరువుకు ఒకరికొకరు నమస్కరించుకున్నారు. అమ్మవారికి మరోసారి దండం పెట్టిన రోశయ్య వెనుదిరిగారు.

Click here for PhotoGallery