అమరావతిలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలి

అమరావతిలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలి

29-04-2017

అమరావతిలో ప్రతిఒక్కరు భాగస్వామ్యం కావాలి

 అమరావతి  నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల సంకల్పం ప్రపంచ దేశాలు గుర్తించేలా సంకల్పం ప్రపంచ దేశాల గుర్తించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేస్తున్న ప్రయత్నానికి భగంతునితో పాటు ప్రజలందరూ ఆశీర్వదించాలని అన్నారు. రాజధాని నిర్మాణం అంటే మామూలు విషయం కాదన్నారు. కృష్ణానది ఈశన్య దిశగా ప్రవాహం వెళ్తున్న చోట రాజధాని వాస్తు ప్రపంచలోనే గొప్ప వాస్తు అని పేర్కొన్నారు. శాతవాహనుల రాజు ఏలిన పట్టణం, బుద్దుడు కాలచక్రం రాసిన పట్టణం అమరావతి అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా, అందరూ మెచ్చే నగరంగా రాజధాని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారన్నారు.  సమ్యసలను సవాళ్లుగా తీసుకొని, వాటిని అధిగమించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారన్నారు.  రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి ఆధునిక రాజధాని నిర్మాణానికి సంకల్పించారని అన్నారు.