రాజధాని రాష్ట్రానికి గుండెకాయలాంటిది : చంద్రబాబు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

రాజధాని రాష్ట్రానికి గుండెకాయలాంటిది : చంద్రబాబు

29-04-2017

రాజధాని రాష్ట్రానికి గుండెకాయలాంటిది : చంద్రబాబు

అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిపై అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్ణయం తీసుకున్నామని  అన్నారు. రాజధాని అనేది రాష్ట్రానికి గుండెకాయలాంటిందని అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా మారిందన్నారు. అమరావతి పేరుకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు. నగరాల ద్వారానే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని అన్నారు. రాజధానిలో పరిపాలనతో పాటు ఆర్థిక కార్యకలాపాలు జరగాలని అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణానికి రైతులు 33వేల ఎకారలను స్వచ్ఛందంగా ఇచ్చినట్లు తెలిపారు.