ఈనెల 21న రాజధానిలో మట్టి, నీరు చల్లకం

ఈనెల 21న రాజధానిలో మట్టి, నీరు చల్లకం

29-04-2017

ఈనెల 21న రాజధానిలో మట్టి, నీరు చల్లకం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నలు మూలల నుంచి అమరావతి నిర్మాణానికి ప్రజలు విశ్వాసం నమ్మకంతో పంపుతునన మట్టి, నీటిని రాజధాని ప్రాంతంలో 21 తేదీ చల్లనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజారాజధానిగా అమరావతి నిర్మాణం కానున్నది.  13 వేల గ్రామాలు, మూడు వేల వార్డుల నుంచి వచ్చిన మట్టి, నీటిని ఒకచోటకు చేర్చి ముందుగా కలుపుతామన్నారు. ఆ మట్టి, నీటిని హెలికాప్టర్‌ నుంచి చల్లుతామన్నారు. అందరిక సంకల్పాన్ని మనోభిష్టాన్ని ప్రతిబింబింప చేయాలనేది తమ ఆలోచన అని అన్నారు.