ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రా భోజనం సిద్ధం

ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రా భోజనం సిద్ధం

29-04-2017

ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రా భోజనం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాటు తుదిదశకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీకోసం అధికారులు ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. ఆంధ్రా రుచులు సిద్ధం చేయాలని పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం అందడంతో అందుకోసం అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ నవరాత్రుల ఉపవాస దీక్ష విరమించకపోతే నిమ్మరసం, పండ్లు సిద్ధం చేయాలని కూడా పీఎంవో ఆదేశించింది. మోడీ భోజనంలో ఆంధ్రుల గోంగూర పచ్చడి, ఉలవచారు, బొబ్బట్లు, ఉండేలా చూస్తున్నారు. మవోవైపు  వీవీఐపీల కోసం ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. వాటిలో చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, వెజ్‌ బిర్యానీ, ఉలవచారు, ఆవకాయ, దప్పళం, పుల్కా, రోటీ, వెజ్‌ కర్రీలు తయారు చేయనున్నారు.       జపాన్‌, సింగపూర్‌, చైనా ప్రతినిధులకోసం ఆయా దేశాలకు చెందిన ప్రత్యేక చెఫ్‌లను పిలిపించారు. ఆయా ేశాలకు సంబంధించిన ప్రత్యేక వంటకాలను ఈ చెఫ్‌లు వండి వారుస్తారు. ఇక ఈ విందు వంటకాలకు దేశంలోని ప్రముఖ ఐటిసి హోటల్‌ ఆధ్వర్యంలో కేఎంకే ఈవెంట్‌ బృందం తయారు చేస్తున్నది.