పుణ్యజల కలశాలకు ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

పుణ్యజల కలశాలకు ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

29-04-2017

పుణ్యజల కలశాలకు ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నీరు-మట్టి గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మతాలకు చెందిన గురువులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  నీరు-మట్టి కళశాలకు పూజలు నిర్వహించిన అనంతరం వాటిని శంకుస్థాపన ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంకు తరలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాణిక్యాలరావు, పరిటాల సునీత, ఎంపీ మల్లారెడ్డి, తెలంగాణ తెలుగుదేశం నేతలు గోపినాథ్‌, కొత్తకోట దయాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.