రాజధాని శంకుస్థాపనకు సర్వం సిద్ధం

రాజధాని శంకుస్థాపనకు సర్వం సిద్ధం

29-04-2017

రాజధాని శంకుస్థాపనకు సర్వం సిద్ధం

గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెంలో నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. రాజధాని శంకుస్థాపన ప్రాంగణాలను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముస్తాబైన వేదికలు, లోపలికి ఏ ఒక్కరినీ పోలీసులు అనుమతించడం లేదు. 12మంది ఐపీఎస్‌లు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. 3వేల మంది వరకు వీఐపీలు హాజరుకానున్నారు. ఒక ప్రధాన వేదిక, ఒక సాంస్కృతిక వేదిక, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆసీనులయ్యేందుకు మరో వేదిక నిర్మించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికీ దాదాపు 25వేల మంది కూర్చోవడానికి వీలుగా ప్రధాన గ్యాలరీ నిర్మాణం పూర్తి చేశారు. సభాప్రాంగణంలో 15ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. రాజధాని శంకుస్థాపన సందర్భంగా సేవలందించేందుకు తూళ్లూరు, పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 2వేల మంది యువకులను సమీకరించారు.  శంకుస్థాపన కార్యక్రమానికి 2 లక్షల మంది వస్తారని అంచనా వేసి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉద్ధండరాయుని పాలెంలో శంకుస్థాపన ఏర్పాట్లును చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. గ్రామంలో ఒకపెద్ద పండుగ వాతావరణం నెలకొంది