అమరావతి ప్రాంతంలో చంద్రబాబు విహంగ వీక్షణం

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు విహంగ వీక్షణం

29-04-2017

అమరావతి ప్రాంతంలో చంద్రబాబు విహంగ వీక్షణం

రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విహంగ వీక్షణం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో శంకుస్థాపన జరిగే ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సీఆర్‌డీఏ భూముల్లో పవిత్ర మట్టి-పుణ్యజలాల మిశ్రమాన్ని అకాశమార్గం నుంచి అమరావతి ప్రాంతంలో చల్లారు.  ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాలు, దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, మహానుభావుల జన్మస్థలాల నుంచి నీరు, మట్టిని సేకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పవిత్రమైన నీరు, మట్టిని అమరావతిలో చల్లడం ద్వారా ఈ ప్రాంతమంతా శక్తిమంతమవుతుందని చెప్పారు.