ప్రపంచస్ధాయి నగరంగా అమరావతి నిర్మాణం : ఈశ్వరన్
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

ప్రపంచస్ధాయి నగరంగా అమరావతి నిర్మాణం : ఈశ్వరన్

29-04-2017

ప్రపంచస్ధాయి నగరంగా అమరావతి నిర్మాణం : ఈశ్వరన్

అమరావతి నగరం త్వరలోనే అద్భుత నగరంగా రూపుదిద్దుకుంటుందని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అన్నారు. అమరావతి శంకుస్థాపన  వేదికపై నుంచి ఈశ్వరన్‌ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు  తెలిపారు. అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించేందుకు సింగపూర్‌ సిద్దంగా ఉందని తెలిపారు. భారత్‌-సింగపూర్‌ మద్య సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోవాలని ఆకాంక్షించారు.  ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రణాళికలో భాగస్వాములు కావడం మాకు లభించిన గౌరవం అన్నారు.  ప్రజా రాజధానిగా, ఆర్థిక, పర్యాటక, ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో మేటిగా రాజధాని ఉండాలని చంద్రబాబు సూచించారు. దాని ప్రకారమే ప్రణాళిక రూపొందించామన్నారు.  ప్రపంచస్థాయి నగరంగా అమరావతి నిర్మాణం జరగాలన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావలన్నారు. 

View Photogallery