కొలంబస్‌ (ఒహాయో)లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

కొలంబస్‌ (ఒహాయో)లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

02-05-2017

కొలంబస్‌ (ఒహాయో)లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొలంబస్‌లోని అల్లాదీన్‌ శ్రీన్‌ సెంటర్‌లో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జూలై 5వ తేదీన ఘనంగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు స్వామివార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఓహాయో (టాకో), టీటిడి ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంచి పెట్టారు. రామచంద్రరావు రేవూరు, రవి సామినేని, మురళీ పుట్టి, రాధిక డేగ, శ్రీధర్‌ కేసాని, గణేష్‌ వద్యం, బాపయ్య కోనేరు, సతీష్‌ సింగం పల్లి, వెంకట్‌ కొల్లిపర తదితరులు ఈ కళ్యాణోత్సవ వేడుకలు వైభవంగా జరిపేందుకు కృషి చేశారు. తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు, టిటిడి చైర్మన్‌ చదలవాద కృష్ణమూర్తి, టిటిడి జెఇఓ పోలా భాస్కర్‌ తదితరులు వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు.

View Event Gallery