వాషింగ్టన్ డీసిలో ఘనంగా టిటిడి కళ్యాణం

వాషింగ్టన్ డీసిలో ఘనంగా టిటిడి కళ్యాణం

02-05-2017

వాషింగ్టన్ డీసిలో ఘనంగా టిటిడి కళ్యాణం

అమెరికాలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా  జూలై 11వ తేదీన వాషింగ్టన్‌డీసిలోని శ్రీ వేంకటేశ్వర లోటస్‌ టెంపుల్‌లో ఘనంగా శ్రీనివాసకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన ఆలయ అర్చకులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆ రోజు ఉదయం నుంచి తిరుమలలో జరుగుతున్నట్లుగానే స్వామివారి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సుప్రభాతం, తోమాలసేవ, సహస్రనామ అర్చన నిర్వహించిన తరువాత శ్రీనివాస కళ్యాణ వేడుకలను వైభవంగా జరిపారు.

ఈ సందర్భంగా తిరుపతి నుంచి తెప్పించిన లడ్డూలను భక్తులందరికీ అందజేశారు. టీటిడి ధర్మకర్తల మండలి చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, టీటిడి జెఇఓ పోలాభాస్కర్‌, టీటిడి చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ డి. నాగేందర్‌ కుమార్‌ తదితరులు ఈ వేడుకను పర్యవేక్షించారు. తానా మాజీ అధ్యక్షులు మోహన్‌ నన్నపనేని, గంగాధర్‌ నాదెళ్ళ, తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, ఉప్పుటూరి రామ్‌చౌదరి, సత్తిరాజు సోమేశ్వరరావుతోపాటు రవి అహరం, వెంకట ముల్పూరి, సత్య కోసూరి రావు ముళ్ళపూడి, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.


View Event Gallery