మౌంటెయిన్ హౌజ్ ట్రేసీలో ఉగాది వేడుకలు

మౌంటెయిన్ హౌజ్ ట్రేసీలో ఉగాది వేడుకలు

02-05-2017

మౌంటెయిన్ హౌజ్ ట్రేసీలో ఉగాది వేడుకలు

మౌంటెయిన్‌ హౌస్‌ ట్రేసీలో ఉంటున్న తెలుగువారు దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బే ఏరియా, సెంట్రల్‌ వ్యాలీలో ఉన్న తెలుగువారందరూ పాల్గొన్నారు. ఈ వేడుకలకు అసెంబ్లీ సభ్యుడు సుసన్‌ తలమెంట్స్‌ ఎగ్‌మెన్‌, మౌంటెన్‌ హౌస్‌ సిఎస్‌డి ప్రెసిడెంట్‌ బ్రెయిన్‌ లూసీద్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బెర్నిస్‌ టెంగిల్‌, ట్రేసీ మేయర్‌ మిషల్‌ మైఖెల్‌ ముఖ్య అతిధులుగా వచ్చారు. కిరణ్‌ రాంభట్ల పంచాంగ శ్రవణం చేశారు. ఎంటిటిఎ వైస్‌ ప్రెసిడెంట్‌ రవికిరణ్‌ కేతిడి వచ్చినవారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.