టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

03-05-2017

టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సన్‌ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో Olathe South హైస్కూల్లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ కాన్సన్‌ సిటీ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న తెలుగువారందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సంవత్సరం అందరికి శుభాలు కలగాలని కోరుకుంటూ అందరికి ఉగాది పచ్చడి, పానకాలను పంపిణీ చేశారు. ప్రధాన కార్యదర్శి సురేష్‌ గుండు సదస్సుని ఉద్దేశించి ప్రసంగించడంతో, ఆ తరువాత పూజారి గారి పంచంగ శ్రావణం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది.

ఈ సందర్భంగా ఏడు గంటలపాటు 150 మంది స్థానిక కళాకారులు ఇచ్చిన 25 ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భం గా  2016 సంవత్సరపు అధ్యక్షలు శ్రీకాంత్‌ రవికంటి, 2016 కార్యవర్గాన్ని  మరియు 2016 ట్రస్ట్‌ బోర్డ్‌ ని సభ కి పరిచయం చేసారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన వివధ పోటిలలో రాష్టస్తాయిలో ప్రతిభచూపెట్టిన విద్యార్థులను సత్కరించారు. ఆ తరువాత చక్కని  తెలుగు భోజనాలను అందరు  ఆరగించి ఆనందించారు. కొస మెరపుఏమిటి  అంటే  3 కార్యక్రమాల  తరువాత  ఫైర్ అలారం curtain trigger అవడం తో కార్యక్రమానికి ఇబ్బంది కలిగినా పిల్లలు, పెద్దవాళ్ళు, నేర్పించిన టీచర్లు అందరు కలిసి సహాయం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.