కనువిందు చేసిన ‘తానా’ కార్యక్రమాలు
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

కనువిందు చేసిన ‘తానా’ కార్యక్రమాలు

05-05-2017

కనువిందు చేసిన ‘తానా’ కార్యక్రమాలు

తానా చైతన్యస్రవంతి వేడుకల్లో భాగంగా విజయవాడలోని లక్కీపేటలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో డిసెంబర్‌ 21వ తేదీన జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినుల బృందం ప్రదర్శించిన ‘దండాలమ్మ దండాలమ్మ’ డప్పు వాయిద్య జానపద నృత్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. భద్రాచలం ప్రాంతానికి చెందిన కొమ్ము వాయిద్య ప్రదర్శన ఆకట్టుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన రాధామాధవం నృత్య కళాకారుల బృందం కృష్ణతాండవం మైమరపించింది. వరంగల్‌ ప్రాంతానికి చెందిన లంబాడీ నృత్యాలు, ఆదిలాబాద్‌కు చెందిన గోండీ నృత్యాంశాలు విశేషంగా అలరించాయి. భరతవేదమున అంటూ మిక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు, కృష్ణలంకకు చెందిన వంగవీటి మోహనరంగా యోగా స్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన శివ తాండవ ృత్యం ప్రేక్షకులను కట్టిపడేశాయి. యోగా నృత్యానికి ముగ్దులైన తానా సభ్యులు 25వేల రూపాయలను బహూమతిగా అందజేశారు.

కళారంగంలో 70 ఏళ్ళ నుంచి విశేష సేవలు అందించిన ప్రజానటుడు కర్నాటి లక్ష్మీనరసయ్య, వయోలిన్‌ విద్వాంసులు అన్నవరపు రామస్వామి, రంగస్థల కళాకారులు ఆచంట వెంకటరత్నంలను తానా సంఘం అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని, తానా మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, తానా 20వ మహాసభల కన్వీనర్‌ నాదెళ్ళ గంగాధర్‌ వారిని ఘనంగా సత్కరించారు. మృదుల వ్యాఖ్యానం అందరినీ అలరించింది.

View Event Gallery

\r\n', 'TANA, Chaitanya Sravanthi Programme, Vijayawada, AP', 'TANA, Chaitanya Sravanthi Programme, Vijayawada, AP', 'తానా చైతన్యస్రవంతి వేడుకల్లో భాగంగా విజయవాడలోని లక్కీపేటలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో డిసెంబర్‌ 21వ తేదీన జరిగిన కార్యక్రమాల్లో ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.', '1419246555.jpg', '1', 543, 'TANA-Chaitanya-Sravanthi-2014-in-Vijayawada', '22-12-2014', ''),