ప్రవాస భారతీయులకు అండగా ఉంటాం : నన్నపనేని

ప్రవాస భారతీయులకు అండగా ఉంటాం : నన్నపనేని

05-05-2017

ప్రవాస భారతీయులకు అండగా ఉంటాం : నన్నపనేని

ప్రవాస భారతీయుల పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఎల్లవేళలా అండగా ఉంటామని తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌ అన్నారు. ఖమ్మంలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు నూతలపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రవాస భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, వారి తల్లి తల్లిదండ్రులు అదైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రవాస భారతీయులు జన్మభూమి  రుణం తీర్చుకోటానికి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. త్వరలో డెట్రాయిట్‌లో జరిగే తానా సభలకు జిల్లా నుంచి ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులను కూడా ఆమ్వానిస్తున్నట్లు తెలిపారు.  ఈ సమావేశంలో తానా మాజీ అధ్యక్షుడు నాదెండ్ల గంగాధర్‌, ఎన్‌ఆర్‌ఐ అసోషియేషన్‌ ఉపాధ్యక్షులు ఎం.స్వరూపరాణి, జి.పట్టాభిరామారావు, సంయుక్త కార్యదర్శి ఎన్‌.నాగేశ్వరరావు, సీహెచ్‌ రమేశ్‌ బాబు, మంజుల పురుష్తోంరావు, కృష్ణప్రసాద్‌, తానా ప్రతినిధులు జయశంకర్‌, తాతా మధు, డాక్టర్‌ రాజు, కోమటి జయరాం, కోడాలి నాని, గారపాటి ప్రసాద్‌, సతీష్‌, చిన్నావాసుదేవరెడ్డి పాల్గొన్నారు.