అమెరికా-భారత్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు

అమెరికా-భారత్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు

11-09-2017

అమెరికా-భారత్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు

హైదరాబాద్‌లో నవంబర్‌ 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌ )ను అమెరికా - భారత్‌ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఆహ్వానించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఆమెతోపాటు అమెరికా పారిశ్రామికవేత్తల బృందం కూడా ఇందులో పాల్గొంటోంది. యుఎస్‌ తరపున స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు, యుఎస్‌ ఏజెన్సి ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌, నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌, వైట్‌ హౌస్‌ అధికారులతోపాటు, యుఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. భారత ప్రభుత్వం తరపున నీతి అయోగ్‌ ఇతర ఉన్నతాధికారులు ఈ సదస్సు వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.   జూన్‌ 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సమయంలో ఈ సదస్సును భారత్‌తో కలిసి నిర్వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.