ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు

18-11-2017

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు కనీవినీ ఎరుగని భద్రత కల్పించబోతున్నారు. అధికార ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు ప్రొటోకాల్‌ నిబంధనల ప్రకారం వేర్వేరుగా భద్రత కల్పించాల్సి ఉండటంతో ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్‌ భద్రత విభాగం ఆద్వర్యంలో కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం రూపొందించిన భద్రతా ప్రణాళికకు ఎస్పీజీ అధికారులతో  చర్చించి తుదిరూపు ఇవ్వనున్నారు. సదస్సు జరిగే హెచ్‌.ఐ.సి.సి.తో పాటు ఇవాంకా బసచేసే వెస్టిన్‌ హోటల్‌, ప్రధాని పాల్గొనే మెట్రోరైలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతకు అవసరమైన వాహనాల్లో కొన్నింటిని జిల్లాల నుంచి తెప్పిస్తున్నారు. రవాణా శాఖకూ లేఖ రాశారు. ఇవాంకా వాహనశ్రేణిని అమెరికా భద్రత అధికారులే సమకూర్చుకుంటున్నారు. కేవలం ఫైలట్‌ వాహనాలను మాత్రమే పోలీసుశాఖ ఏర్పాటు చేస్తోంది.