సౌదీ అరాంకో ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

సౌదీ అరాంకో ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

19-04-2017

సౌదీ అరాంకో ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సంస్థలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సౌదీ అరాంకో సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. భారత్‌లో రిఫైనరీ స్థాపనకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సౌదీ అరాంకో సంస్థ తెలిపింది. పెట్రో కెమికల్స్‌ రంగంపై ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సౌదీ అరాంకో ప్రతినిధులు ఉత్సకత చూపారు. సౌదీలో తమ సంస్థ పరిశీలనకు బృందం పంపాలని ప్రతినిధులు కోరగా, త్వరలో ఒక బృందాన్ని పంపిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ తదితరులు  సమావేశంలో పాల్గొన్నారు.