అమరావతి నిర్మాణంలో భాగస్వాములవాలి : చంద్రబాబు

అమరావతి నిర్మాణంలో భాగస్వాములవాలి : చంద్రబాబు

19-04-2017

అమరావతి నిర్మాణంలో భాగస్వాములవాలి : చంద్రబాబు

అమరావతిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని వివిధ సంస్థల సీఈఓలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. దావోస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పలు సంస్థల అధినేతలతో భేటీ అయ్యారు. అనంతరం సీఐఐ సీఈఓ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒకే వేదికపై ఇంత మంది పారిశ్రామిక, వాణిజ్య, ప్రముఖులను, మేధావులను కలుసుకోవడం, వీరందరితో రాష్ట్రాభివృద్ధికి చర్చించడం ఈ సదస్సు ద్వారా సాధ్యమైదని అన్నారు.  సంతోషం, సంపద కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టి మా వృద్ధిలో భాగస్వాములుకండి అని పిలుపునిచ్చారు.  మీ సలహాలు, సూచనలు మాకు అవసరం. వ్యాపారవేత్తలను తీర్చిదిద్దడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అని అన్నారు.